Politics

ప్రజామద్దతుతోనే నేను ముఖ్యమంత్రిని అయ్యాను

YS Jagan Speech In Sreekaakulam

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగం ఆద్యంతం ఆస‌క్తిదాయ‌కం సాగింది. ప్ర‌సంగ విశేషాలు ఆయ‌నమాటల్లోనే…..ఈ ప్రాంత ఆప్యాయ‌త ఎన్న‌టికీ మ‌రువ‌ను.ప్రజాశిస్సులు వ‌ల‌నే ఘ‌నవిజ‌యం సాధించాను. 151 స్థానాల‌తో యాభై శాతం పైగా ఓటు బ్యాంకుతో మీ అంద‌రి దీవెన‌ల‌తో ఈ స్థానాన్ని పొంద‌గ‌లిగాను. 3648కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌లో స‌మ‌స్య‌లు విన్నాను.ఆ రోజు నేను ఉన్నాను అని చెప్పేను.ఈ రోజు అక్ష‌రాల వంద రోజులు తిర‌గ్గ‌ముందే నాటి మాట‌ను నిల‌బెట్టుకునేందుకు ఆచ‌ర‌ణలో పెట్టేం దుకు కృషి చేస్తూ మీ అంద‌రి ఆశీర్వాదం పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం.నాటి పాద‌యాత్ర‌లో కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల వేద‌న న‌న్నెం తో క‌దిలించింది.నాటి ప్ర‌జ‌ల మాట‌ల‌ను మ‌రువ‌క అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల‌కు పెన్ష‌న్ ప‌ది వేల రూపాయ‌లు ఇచ్చేలా మొట్ట‌మొద‌టి సంత‌కం చేశాను.ఈ రోజు ఈ కిడ్నీ బాధితుల‌కు తోడుగా ఉండేందుకు నాటి మాట ప్ర‌కారం 200 ప‌డ‌కల సూప‌ర్ స్పెషాల్టీ ఆస్ప‌త్రి రీసెర్చ్ సెంట‌ర్ తీసుకువ‌స్తాన‌ని చెప్పాను..ఇప్పుడు అందుకు అనుగుణంగా శంకుస్థాప‌న ఈవేళ చేస్తున్నాను. అంతేకాదు ఇక్క‌డి బాధితుల‌కు డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు ప‌ది వేల రూపాయ‌లు ఇస్తూ స్టేజ్ 3 నుంచే అంటే మందుల వాడ‌కం నుంచి కూడా 5వేల రూపాయ‌లు పింఛ‌ను ఇస్తాను.స్థానిక ఎమ్మెల్యే విజ్ఞాప‌న మేర‌కు స్టేజ్ 5 కాదు స్టేజ్ 3 వారికి పింఛ‌ను ఇప్పుడు ప్ర‌క‌టించ‌న వారికి 5 వేలు ఇస్తాం. ఐదు సీకేడీ పేషేంట్ల‌కు ఒక హెల్త్ వ‌ర్క‌ర్ కూడా ఉంటారు. ఫ్రీ బ‌స్ పాస్ పేషంట్ల‌కు వారికి స‌హా యంగా ఉండేవారికి కూడా ఇస్తాం.అదేవిధంగా ఇచ్ఛాపురం, ప‌లాస నియోజ‌క‌వ‌ర్గాల‌కు తాగునీరు ఇచ్చేలా ఆరు వంద‌ల కోట్ల‌తో తాగునీటి ప‌థ‌కం ఆరంభిస్తాం.అందుకు త‌గ్గవిధంగా సంబంధిత ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తున్నాం ఈ రోజు.ఫిషింగ్ జెట్టీ ఇస్తాం అని మాట ఇచ్చాను. అందుకు అనుగుణంగా మంచి నీళ్ల పేట వ‌ద్ద శంకుస్థాప‌న చేస్తున్నాం.జెట్టీ అనే కాకుండా మ‌త్స్య‌కారులు విశ్రాం తి తీసుకునేందుకు వీలుగా హాలు, కోల్డ్ స్టోరేజ్, షెడ్డులూ,ఇత‌ర సౌక‌ర్యాలూ అందుబాటులోకి తెస్తాం.తిత్లీ బాధితుల‌ను ఆదుకు న్నాం.ప్ర‌తి కొబ్బ‌రి చెట్టుకు 1500 నుంచి మూడు వేలు చెల్లిస్తాం అని, అదేవిధంగా జీడి తోట‌కు సంబంధించి హెక్టారుకు 30 వేల నుంచి యాభై వేలు పెంచుతూ ఈ రోజు నుంచే చెక్కులు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.సాగునీటి ప్రాజెక్టుల‌కు ప్రాధా న్యం.వంశ‌ధార న‌దిపై నేరెడి బ్యారేజ్ ప‌నులు యుద్ధ ప్రాతిప‌దికన ప‌నులు చేప‌డ‌తాం.అదేవిధంగా ఆఫ్ షోర్ రిజ‌ర్వాయ‌ర్ ,నారా య‌ణ పురం,తోట‌పాలెం ప్రాజెక్టుల ప‌నుల‌నూ ఉరుకులు పెట్టిస్తాం.మ్యానిఫెస్టో ను అమ‌లు చేస్తాం.సొంత ఆటో సొంత ట్యాక్సీ ఉన్న వారికి అండ‌గా ఈ నెలాఖ‌రున ప‌దివేలు ఇస్తాం.గ‌త ప్ర‌భుత్వం క‌న్నా పింఛ‌ను 2250 రూపాయ‌ల చొప్పున చెల్లిస్తున్నాం..ప్ర‌తి ఏటా 250 రూపాయ‌ల చొప్పున చెల్లిస్తూ మూడు వేలు చెల్లిస్తాం.అక్టోబ‌ర్ 15 నాటికి రైతు భ‌రోసా కు శ్రీ‌కారం. ప్ర‌తి రైతు కుటుంబా నికీ రూ.12,500 చెల్లింపు.మూడు నెల‌ల కాల వ్య‌వ‌ధిలో నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇవ్వ‌గ‌లిగాం.గ్రామ‌వ‌లంటీరు వ్య‌వ‌స్థ తీసుకు వచ్చాం.పెన్ష‌న్ నుంచి బియ్యం పంపిణీ వ‌ర‌కూ అమ్మ ఒడి నుంచి రైతు భ‌రోసా దాకా ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌థ‌కం అందేలా చేస్తాం.. ఈ వ‌లంటీరు వ్య‌వ‌స్థ ద్వారా..న‌వంబ‌ర్ లో మ‌త్స్యకారుల‌కు తోడుగా ఉండేందుకు నవంబ‌ర్ 21న వేట‌కు వెళ్లే ప్ర‌తి మ‌త్స్య‌కారునికీ అండ‌గా ఉండేందుకు ప‌ది వేల రూపాయ‌లు ఇస్తాం.ఆ రోజు నుంచి ఎంపిక చేసిన బంకుల్లో డీజిల్ స‌బ్సిడీ నేరుగా పొందేందుకు అ వ‌కాశం. అదే విధంగా స‌బ్సిడీని పెంచుతాం.డిసెంబ‌ర్ 21న నాటికి చేనేత కుటుంబానికి 24 వేల రూపాయ‌లు అందిస్తాం. జ‌న‌వ‌రి 26న అమ్మ ఒడి ప‌థ‌కానికి శ్రీ‌కారం.15వేల వ‌ర్తింపు.ఇదే ఏడాది ఇంజ‌నీరింగ్ తో స‌హా ఉన్న‌త విద్య అభ్య‌సిస్తున్న వారికి పూర్తి ఫీజు రీ యింబ‌ర్స్ మెంట్ ఇవ్వ‌డ‌మే కాకుండా ప్ర‌తి విద్యార్థికీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కు 20 వేలు చెల్లింపు.ఫిబ్ర‌వ‌రిలో ర‌జ‌కుల‌కూ, నాయీ బ్రాహ్మ‌ణుల‌కు ప‌ది వేలు, మార్చిలో అన్ని మ‌త పెద్ద‌లకు ఆర్థికంగా చేయూత.ఉగాది నాడున మ‌హిళ‌ల‌కు 25 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టా లు.సంవ‌త్సరానికి ఆరు ల‌క్ష‌ల చొప్పున ఇళ్ల నిర్మాణం.రానున్న శ్రీరామ‌న‌వ‌మి నాడు వైఎస్సార్ పెళ్లి కానుక వ‌ర్తింపు.అంద‌రి సంక్షేమం కోసం అసెంబ్లీలో 19 చ‌ట్టాల‌కు ఆమోదం.ఎస్సీ ఎస్టీల హ‌క్కుల కోసం సంబంధిత చ‌ట్టాల‌నే మార్చాం.బీసీల‌కూ, ఎస్సీ ల కూ, ఎస్టీల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు నామినేటెడ్ ప‌దవుల్లో యాభై శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తింపు.