ScienceAndTech

భారతీయుల కోసం మోటోరోలా టీవీలు

Motorola shocks oneplus TV wing with new releases

పాపులర్‌ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ నుంచి టీవీ రాబోతోందని ఇండియా అంతా ఎదురుచూస్తోంది. ఎనిమిది స్పీకర్లతో అట్టహాసంగా రాబోతున్న వన్‌ప్లస్‌ టీవీకి – ముందే చెక్‌ పెట్టడానికా అన్నట్టు మోటోరోలా స్మార్ట్‌ టీవీని రిలీజ్‌ చేసి ఇండియన్‌ మార్కెట్లోకి వదిలింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త టీవీలు అతి త్వరలో లభించబోతున్నాయి. పద్నాలుగువేల రూపాయల్లోపే 32 అంగుళాల స్క్రీన్‌తో అతి తక్కువలో హై- క్వాలిటీ టీవీని అందిస్తూ – రాబోయే వన్‌ప్లస్‌తో మోటోరోలా పోటీ పడుతోంది. స్మార్ట్‌ టీవీ మార్కెట్లో ఇప్పటికే వీయూ (VU), ఎంఐ (Mi) లాంటివి ఉన్నప్పటికీ వన్‌ప్లస్‌కి ఉన్న బ్రాండ్‌ వాల్యూని బట్టి ఆ కంపెనీ రిలీజ్‌ చేయబోయే స్మార్ట్‌టీవీల గురించి జనం ఎదురుచూస్తున్నారు. అయితే మోటోరోలా స్మార్ట్‌ టీవీలు వాటికి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. డాల్బీ విజన్ (Dolby Vision), హెచ్‌డీఆర్-10 (HDR 10) లాంటి విజువల్‌ ఫీచర్స్‌ కలిగి ఉండడమే కాకుండా … మోటోరోలా టీవీలు రకరకాల రేంజ్‌ల్లో దొరుకుతున్నాయి.

32-అంగుళాలు ఫుల్‌ హెచ్‌డీ టీవీ రూ. 13,999
43-అంగుళాలు ఫుల్‌ హెచ్‌డీ టీవీ రూ. 24,999
43-అంగుళాలు అల్ట్రా హెచ్‌డీ టీవీ రూ. 29,999
50-అంగుళాలు అల్ట్రా హెచ్‌డీ టీవీ రూ. 33,999
55-అంగుళాలు అల్ట్రా హెచ్‌డీ టీవీ రూ. 39,999
65-అంగుళాలు అల్ట్రా హెచ్‌డీ టీవీ రూ. 64,999

మోటోరోలా స్పీడ్‌ చూస్తుంటే రాబోయే వన్‌ప్లస్‌ టీవీ మార్కెట్‌కి ఎంతో కొంత గండి కొట్టేలాగే ఉందంటున్నారు పరిశీలకులు.