NRI-NRT

సైరా ప్రీమియర్ టికెట్ ధర $29. జేబు చిల్లు ఖాయం-TNI ప్రత్యేకం

Sye Raa Premier Tickets Priced At 29 USD | TNILIVE Telugu USA Movies - సైరా ప్రీమియర్ టికెట్ ధర . జేబు చిల్లు ఖాయం-TNI ప్రత్యేకం

“బాహుబలి” పరిచిన సినిమా టికెట్ ధరల బాటలో నడుస్తున్న అమెరికాలోని తెలుగు చలనచిత్ర పంపిణీదారులు తొలిరోజు వసూళ్లపై మాంచి గురిపెట్టారు. రాంచరణ్ నిర్మాణంలో రూపొందుకున్న “సైరా” సినిమా అక్టోబర్ 1వ తేదీన అమెరికావ్యాప్తంగా ప్రీమియర్ ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ ప్రీమియర్ ప్రదర్శన ధర డాలస్ ప్రాంతీయంగా ప్రస్తుతం $29గా నిర్ణయించారు. 2వ తేదీ నుండి దీని ధర $17కు దిగిరావడం కూసింత సాంత్వన కలిగించే అంశం. బాహుబలి ప్రీమియర్ ప్రదర్శన టికెట్లు $30కు అమ్మిన అప్పటి పంపిణీదారులను సైరా పంపిణీదారులు బానే అనుసరిస్తున్నారని ప్రవాస సినీప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. బాహుబలి రెగ్యూలర్ టికెట్ $25కు అమ్మినప్పటికీ సైరాను మాత్రం $17 వద్ద కట్టడి చేయడం కాస్త ఆహ్లాదపరిచే విషయం. నలుగురు వ్యక్తులు కలిగిన ఒక కుటుంబం అమెరికాలో మామూలు రోజుల్లో పెద్ద హేరోల చిత్రాలు చూడాలంటే కనీసంగా $125 డాలర్లు ఖర్చు చేయాలి. అదే కుటుంబం ప్రీమియర్‌కు అయితే కనీసంగా $200 డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఖర్చు పెట్టే స్థోమత లేక కాదు…ఇంత ఖర్చు 2గంటల ఓ కథకు పెట్టడం దుబారా ఖర్చు అని సామాజిక స్పృహతో ఆలోచించే ప్రవాస సినీ అభిమానులు అమెజాన్ ప్రైమ్ వైపో లేదా ఏదైనా పండక్కి టీవీ వైపో ఎదురుచూడటానికి ఆలోచించట్లేదు. ఆదా చేసిన ఆ దుబారా ఖర్చులో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడంలోనూ వెరవట్లేదు. ఎటు తిరిగి అధిక పెట్టుబడులతో చిత్రాల పంపిణీని భుజాలపై మోస్తున్న వ్యాపారస్థులకే కూసింత ప్రేక్షకులపై దయ కలగాలి. ఇమేజ్‌తో కాకుండా కథాబలంతో ప్రేక్షకులను సూదంటు రాయిలా ఆకర్షించి సినిమాలు విజయాలు సాధించేలా తోడ్పడాలి. ఈ ఏడాది విడుదల అయి వేల కోట్ల డాలర్ల వ్యాపారం చేసిన Avengers EndGame వంటి చిత్రాల టికెట్ ధరలే $9 దాటలేదనే వాస్తవం గుర్తెరగాలి.