DailyDose

బాలకోట్‌లో 500 మంది ఉగ్రవాదులు:నేరవార్తలు-09/23

500 Terrorists In Balakot - 500 Terrorists In Balakot-Telugu Crime News Today-09/23 - బాలకోట్‌లో 500 మంది ఉగ్రవాదులు:నేరవార్తలు-09/23

* బాలాకోట్ మ‌ళ్లీ పుంజుకున్న‌ది. అక్క‌డ సుమారు 500 ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు. ఇవాళ చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. పుల్వామా దాడి త‌ర్వాత భార‌త ద‌ళాలు పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర‌స్థావ‌రాన్ని ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. అయితే అదే స్థావ‌రం వ‌ద్ద మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు త‌మ కార్య‌క‌లాపాల‌ను పున‌రుద్ద‌రించిన‌ట్లు ఆర్మీ చీఫ్ స్ప‌ష్టం చేశారు. బాలాకోట్ స్థావ‌రంపై మ‌రోసారి స‌ర్జిక‌ల్ దాడి చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని రావ‌త్ తెలిపారు.
* విజయనగరం కుమిలి లో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం కుమిలి లో నిర్వహించిన పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల్లో కొట్లాట చోటు చేసుకుంది. వాలంటీర్లను పాఠశాల నుండి బయటకు పంపాలంటూ.. టిడిపి వర్గం ఆందోళన చేసింది. దానికి వైసిపి వర్గీయులు నిరాకరించారు. దీంతో భోగేష్‌ అనే టిడిపి వ్యక్తి అప్పలనాయుడు అనే వైసిపి వర్గీయుడి మధ్య మాటల యుద్ధం కొట్లాటకు దారితీసింది. ఇంతలో పోలీసులతో పాటు గ్రామ పెద్దలు ముత్యలరెడ్డి, సురేష్‌ రెడ్డి లు కలుగచేసుకొని అందరినీ బైటకు పంపించారు. ఈ పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను తలపిస్తున్నాయని, ఎన్నిక పూర్తయ్యేలోపు ఏమి జరుగుతుందోనని ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటున్నారు.
* బిహార్ రాజధాని పట్నాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. రెప్పపాటులో సొమ్మును పోగొట్టుకోవడం ఖాయం. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేసి బ్యాంక్‌ లావాదేవీలు చేస్తే…సైబర్‌ నేరగాళ్ల బారిన పడక తప్పదు. పట్నాలోని ఒక ఇంజనీర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదునైంది. వంద రూపాయల రిఫండ్‌ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన వైనం ఒకటి చోటు చేసుకుంది. దీంతో కోల్పోయిన తన సొమ్ముకోసం బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు బాధితుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన విష్ణు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా ఫుడ​ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఆహార నాణ్యతపై సంతృప్తి చెందక దాన్ని తిరిగి పంపించేశాడు. ఇందుకు డబ్బులు వాపస్‌ ఇవ్వాలని కోరగా..జొమాటో కస్టమర్ కేర్‌ను సంప‍్రదించమని. అందులోని మొదటి నంబరుకు ఫోన్‌ చేయమని డెలివరీ బాయ్‌ సలహా ఇచ్చాడు. దీంతో విష్ణు గూగుల్ సెర్చ్‌లోని “జొమాటో కస్టమర్ కేర్” అని వున్న నంబరుకు ఫోన్‌ చేశాడు. వెంటనే జోమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ నంటూ ఒక వ్యక్తం కాల్‌ చేశాడు. రూ.100 రిఫండ్‌ చేయాలంటే 10 అదనంగా డిపాజిట్‌ చేయాల్సి వుంటుందంటూ ఒక లింక్‌ను పంపాడు. ఏ మాత్రం ఆలోచించని ఇంజనీర్ వెంటనే లింక్‌పై క్లిక్ చేసి రూ.10 డిపాజిట్ చేశాడు. అంతే ఈ లావాదేవీ జరిగిన కొద్ది నిమిషాల్లోనే విష్ణు బ్యాంక్ ఖాతాలోంచి సొమ్ము మొత్తం గల్లంతైంది. చూస్తూండగానే బహుళ లావాదేవీల ద్వారా 77 వేల రూపాయల మొత్తాన్ని అవతలి వ్యక్తి మాయంచేస్తోంటే.. విష్ణు అచేతనంగా మిగిలిపోయాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 10 జరిగింది. దీంతో లబోదిబోమంటూ విష్ణు తన సొమ్మును వెనక్కి తెచ్చుకునే పనిలో పడ్డాడు.
* కాశ్మీర్‌లో ఉగ్రవాదులు తమకు సహకరించే వారితో కమ్యూనికేషన్‌ కోల్పోయారని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. కాశ్మీర్‌ లోయలో ప్రజల మధ్య అనుసంధానానికి ఇబ్బందులు లేవని, కమ్యూనికేషన్‌ వ్యవస్థ బాగానే పని చేస్తోందని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న వారిపట్ల ఏం చేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. అటువంటివారిపై ఎలా ప్రతిస్పందించాలో తమ దళాలకు తెలుసునని ఆయన చెప్పారు. తాము అప్రమత్తంగా ఉన్నామని, అనేక చొరబాట్లను నిలువరించామని ఆయన అన్నారు
* పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల గ్రామంలో విష జ్వరంవల్ల గోపి అనే 8వ తరగతి విద్యార్థి మృతి . గ్రామం లోని ప్రజలు విష జ్వరల భారిన పడి మృతి చెందుతున్న ఏ అధికారి కూడా అటు వైపు కన్నేతిచూడని పరిస్థితి
* తాహిసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ నరాల సంజీవరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కోర్టు సర్చ్ వారెంట్ తో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్.ఐ నివాసం ఉంటున్న కర్నూలు లోని ధనలక్ష్మి నగర్ లో సోదాలు జరుగుచున్నవి
* అసోం, శివసాగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని డిమో గ్రామం సమీపంలో ఓ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో సుమారు 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
* రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధర్నా చేపట్టారు. బోటు ప్రమాద బాధిత కుటుంబసభ్యులతో కలిసి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి మునిగిన బోటు తీయాలన్న ఉద్దేశం లేదని హర్షకుమార్‌ ఆరోపించారు. హైకోర్టు సుమోటాగా కేసు స్వీకరించాలని హర్షకుమార్‌ కోరారు.
* జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారి ఆధిత్యనాథ్‌దాస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు నుంచి ఆదిత్యనాథ్‌ను తప్పిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. సీబీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం… ఆదిత్యనాద్‌ దాస్‌కు నోటీసులు జారీ చేసింది.