DailyDose

బలపం ఆశ పెట్టి నాలుగేళ్ల పసికందుపై అత్యాచారం-నేరవార్తలు-10/11

4Year Old Baby Girl Raped In Nizamabad-Crime News Today Telugu-10/11

* విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో తన ప్లాట్‌కు పిలిపించి ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదంతం తాజాగా వెలుగు చూసింది. నన్నయ వర్సిటీలో ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సూర్యరాఘవేంద్ర ఈ వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్‌ క్లాసుల పేరుతో తమను తన ఫ్లాట్‌కు పిలిపించి.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత విద్యార్థినులు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.

* నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మన్నెం లక్ష్మీనరసింహం ఇంటిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం నిర్వహించిన సోదాల్లో లెక్కలో చూపని ఆస్తులు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. గురువారం నిర్వహించిన ఈ సోదాల్లో 7 ఇళ్ల స్థలాలు, నెల్లూరు జిల్లా పరిధిలోని బోగసముద్రం ప్రాంతంలో 14 ఎకరాల వ్యవసాయభూమి, నగరలో రెండంతస్తుల భవనం, కావలిలో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌, రూ.4 లక్షలు నగదు, 18 లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్‌ ధర ప్రకారం దాదాపుగా రూ.20 కోట్లకుపై మాటేనని అధికారులు అబి ప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమా చారంతో ఎసిబి అధికారులు దాడులు చేశారు. నెల్లూరుతో పాటు కావలి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలలో మొత్తం 6 ప్రాంతాల్లో ఆ అధికారికి సంబంధించిన స్నేహితులు, బంధువుల ఇళ్లపై ఏక కాలంలో దాడులు జరిగాయి.

* భూ వివాదంలో తమకు రావల్సిన డబ్బును గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ వృద్ధ దంపతులు వినూత్న నిరసనకు దిగారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురంలో చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మి అనే వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకుపైకి ఎక్కారు. భూ వివాదంలో తమకు రావలసిన డబ్బు గ్రామ పెద్దలు ఇవ్వటం లేదని ఈ రకమైన ఆందోళన చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

* విశాఖ సాగర్ నగర్‌లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. తండ్రి చల్లా ఉమామహేశ్వర రావు.. కొడుకు సతీష్‌చంద్ర, కూతురు లావణ్య మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

* విదేశాల నుంచి స్మగ్లింగ్ చేసి రూ.4.9 కోట్ల బంగారం బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఝార్సీగూడ రైల్వేస్టేషనులో వెలుగుచూసింది. ఝార్సీగూడ రైల్వేస్టేషనులోని జానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు వ్యక్తులు 12.9 కిలోల బరువున్న 110 విదేశీ బంగారం బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశీ బంగారం స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామని అధికారులు వివరించారు.

* వేగంగా దూసుకువచ్చిన యాత్రికుల బస్సు గంగా నదీ తీరంలోని రోడ్డుపై నిద్రిస్తున్న వారిపైనుంచి పోవడంతో ఏడుగురు మృత్యువాత పడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలోని నరౌరా ఘాట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బులంద్ షహర్ నగరంలో గంగా నదీ తీరంలోని నరౌరా ఘాట్ లో స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో వేగంగా వచ్చిన బస్సు ఘాట్ వద్ద రోడ్డు పక్కన నిద్రపోతున్న భక్తులపైకి దూసుకుపోయింది.

* జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ కొండ మార్గంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పర్యావరణ, పర్యాటక క్షేత్రంలోని అక్వేరియంలో గల అరుదైన చేపలు మృత్యువాత పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి వివిధ ప్రాంతాల నుంచి అరుదైన జాతి చేపలు తెచ్చి 14 అక్వేరియంలలో ఉంచారు. కొంత కాలంగా అక్వేరియాల నిర్వహణ సరిగా లేనందున 50కి పైగా చేపలు చనిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యమే చేపల మృతికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనుభవజ్ఞులైన సిబ్బంది ఇక్కడ పని చేసేవారు.

* నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ గ్రామంలో ఓ నాలుగేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు బలపం ఇస్తానంటూ బాలిక వారికున్న స్వీట్ వద్ద ఆడుకుంటుండగా అమ్మాయిని మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పాఠశాలలకు వెళ్లి అత్యాచారం చేశాడని విషయం తెలుసుకున్న బీజేవైఎం మండల అధ్యక్షులు శంకర్ వర్ని ఎస్సై అనిల్ రెడ్డి కి సమాచారం ఇచ్చి పోలీసులను రప్పించారు. అనంతరం గ్రామంలోని యువకులు సుమారు వందల సంఖ్యలో ఆందోళన నిర్వహించారు బాధితులు బతుకుదెరువు కోసం గ్రామానికి రావడం జరిగిందని తెలిపారు. నాలుగేళ్ల పసికందు అని చూడకుండా ఆమెపై అత్యాచారం చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ఎస్సై అనిల్ రెడ్డి వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని ఉయ్యాలపై ఆడుతుండగా కింద పడిందని ప్రత్యక్ష సాక్షుల తెలుపుతున్నారు.

* ఉత్తరప్రదేశ్‌ ఖుషీనగర్‌ జిల్లాలోని దుబౌలీలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ జర్నలిస్టును అడ్డగించిన దుండగుడు అతడి గొంతు కోసి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక హిందీ దినపత్రికలో పనిచేసే రాధేశ్యామ్‌ శర్మ (55) గురువారం బైక్‌పై దుబౌలీ గ్రామం మీదుగా వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు అతడిని అడ్డగించాడు. ఆపై గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

* వెంకటాచలం మండలం నిడుగుంట పాలెం దళితవాడ లో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయనే అనుమానాలు రేకితిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఈదూరు చంద్ర అనే యువకుడు పై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడిచేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన చంద్ర ను ఉటాహుటిన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కి కుటుంబ సభ్యులు తరలించారు. కుంచె శీనయ్య రొయ్యల గుంటల లో పని చేస్తున్న చంద్ర ఉదయం ఇంటి కి వచ్చే సమయంలో దారిలో కాపు కాసి ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేయడం పట్ల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

* పది లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న నాయుడుపేట పోలీసులు

* నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఇచ్చిన ఆదేశాల మేరకు అక్రమంగా తరలిస్తున్న 95 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు గూడురు డి ఎస్ పి బి.భవాని హర్ష మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట లో సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది సహాయంతో ఈ కేసుని చాకచక్యంగా వ్యవహరించి నిందితురాలిని పట్టుకోవడంతో డి.ఎస్.పి భవాని హర్ష సీఐ వేణుగోపాల్ రెడ్డి ని ఎస్.ఐ దాసరి వెంకటేశ్వరరావును మరియు వారి సిబ్బందిని అభినందించారు.

* జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిది షిరిడి హిల్స్ ప్రాంతంలో నివసించే మల్లేష్ సత్యవతి లావణ్య భార్యాభర్తలు ముగ్గురు కలిసి కిరాణం వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మల్లేష్ కు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్యవతి కి పిల్లలు లేకపోవడంతో రెండవ భార్య లావణ్య ను సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ నుండి 2014 లో రెండవ విహహం చేసుకున్నారు. 6 ఏండ్ల లో లావణ్య ఇద్దరు పిల్లలు పాపా, బాబు కు జన్మనిచ్చింది. రాత్రి 3 గంటల సమయం లో పాప కు జ్వరం రావడంతో మందులు ఇవ్వడానికు సత్యవతి, లావణ్య ఇద్దరు లేచి పాప కు మందులు ఇచ్చి పడుకున్న తరువాత 5 గంటల సమయం లో సత్యవతి లేచి చూచే వరకు మనోజ్, లావణ్య కనిపించగా పోవడంతో సత్యవతి మల్లేష్ లు బయట వెతకడం తో నీటి సంపు మూత తెరచి ఉండడం తో అనుమానంతో లోపలికి దిగి చూడగా తల్లి లావణ్య, కొడుకు మనోజ్ మృతి చెంది ఉండడంతో చుట్టూ పక్కల ప్రజల ను పిలిచి మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలిస్తున్నారు. విహహిత తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపారు. సంఘటన స్థలంలో సబ్ ఇన్స్పెక్టర్ రాములు, పోలీసు సిబ్బంది ఉన్నారు.