ఓ భారీ కొండ చిలువ 58ఏళ్ల వ్యక్తిని మింగబోయిన ఘటన కేరళలోని తిరువనంతపురం వద్ద చోటు చేసుకొంది. భువనచంద్రన్ నాయర్ అనే వ్యక్తి నెయ్యార్ ఆనకట్ట దగ్గర ఉన్న ఒక కళాశాలలో పనిచేస్తున్నాడు. బుధవారం కళాశాల ప్రాంగణంలో పనిచేస్తుండగా 10 అడుగుల కొండచిలువ ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో ఊపిరాడక విలవిల్లాడుతున్న నాయర్‌ను రక్షించేందుకు సమీపంలో ఉన్నవారిలో ఇద్దరు వ్యక్తులు ధైర్యంగా ముందుకొచ్చారు. వీరిలో ఒకరు కొండచిలువ తలను, మరొకరు తోకను పట్టుకుని బలంగా లాగారు. వారి ప్రయత్నం ఫలించి భువనచంద్రన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అ కొండచిలువను అటవీ అధికారులకు అప్పగించగా.. వారు దాన్ని సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక పక్క మనిషిని కొండచిలువ చుట్టుకుంటే అక్కడ ఉన్న వారిలో చాలా మంది రక్షించడానికి బదులు వీడియోలు చిత్రీకరించడం గమనార్హం.
కేరళ కొండచిలువకు ఆకలి ఎక్కువే

Related tags :