Movies

తప్పులు చేసేశాను

I did a lot of mistakes says Tamanna

నాది సక్సెస్‌ పయనం కాదు!
తన సినీ పయనం సక్సెస్‌ఫుల్‌ కాదని నటి తమన్నా అంటోంది. ఇటీవల తెలుగులో చిరంజీవితో కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటనకు గానూ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తమిళంలో నటించిన పెట్రోమ్యాక్స్‌ చిత్రం కూడా సక్సెస్‌ కావడంతో చాలా హుషారుగా ఉంది. ఈ సందర్భంగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకు నటి శ్రీదేవి పాత్రలో నటించాలన్నది కోరిక అని పేర్కొంది. ఆమెను తాను ఎప్పుడూ ఒక యువ నటిగానే చూశానని చెప్పింది. శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా చిత్రంగా రూపొందిస్తే అందులో ఆమె పాత్రలో నటించాలని ఆశ పడుతున్నట్లు పేర్కొంది. నిజం చెప్పాలంటే తన సినీ పయనం సక్సెస్‌ఫుల్‌ కాదని అంది. తానూ చాలా తప్పులు చేశానని, అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పింది.