WorldWonders

12వేల కోట్ల ఖర్చుతో కొత్త పార్లమెంట్ భవనం

New Indian Parliament Building To Be Built With 2Billion USD

కొత్త పార్లమెంట్ భవనం, కేంద్ర సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి బిడ్లు ఖరారయ్యాయి. అర్కిటెక్చర్, డిజైన్ బిడ్లు ఖరారు చేస్తూ సీపీడబ్ల్యూడీ నిర్ణయం తీసుకుంది. 250 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టాలి. మూడు ఐకానిక్ భవనాల నిర్మాణానికి ఏజెన్సీలు డిజైన్‌లను ఖరారు చేయనున్నాయి. భవనాల డిజైన్ మనదేశ సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2022 సంవత్సరంలో మూడు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నార్త్ బ్లాక్, సౌత్, ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని కదిలించం. మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.12,450 కోట్లు అని ప్రథమిక అంచనా వేసినట్లు కేంద్రం వెల్లడించింది.