Movies

నాకు నున్నటి బట్టతల ఇష్టం

Yami Gautam Fetish On Bald Head-Telugu Movie News

బట్టతల ఉన్న వ్యక్తులు చాలా కూల్‌ ఉంటారన్నారు నటి యామీ గౌతమ్‌. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘బాలా’ సినిమాలో ఆమె నటించారు. ఆ చిత్రంలో యామీ ‘టిక్‌ టాక్‌ క్వీన్‌’గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా విలేకరి.. నిజజీవితంలో బట్టతల ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. ‘ఎందుకు చేసుకోకూడదు. నా దృష్టిలో బట్టతలతో ఉన్న వ్యక్తులు చాలా కూల్‌గా ఉంటారు. మేము ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కారణం మనుషులు మొదట తమని తాము ప్రేమించుకోవాలి. ఆ తర్వాత ఎదుటవారి నుంచి ప్రేమను ఆశించాలి. కౌశిక్‌ మంచి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ‘బాలా’ టీం ముందుగానే అనుకున్నాం. చిత్ర విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది మాకు కాల్స్‌, మెసేజ్‌లు చేసి అభినందిస్తున్నారు. ‘టిక్‌టాక్‌ క్వీన్‌’ పాత్రలో నేను నటించడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇది ఓ విభిన్నమైన పాత్ర’ అని యామీ తెలిపారు.