Devotional

శబరిమలైపై సుప్రీం తీర్పు

Supreme Court To Deliver Verdict On Sabarimala

1.నేడు శబరిమలై పై సుప్రీం తీర్పు – ఆద్యాత్మిక వార్తలు – 11/13
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల రివ్యూ పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా తదితరులు ఈ ధర్మాసనంలో ఉన్నారు. కాగా అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపైనా సుప్రీం తీర్పును స్వాగతించాలంటూ కేరళ దేవస్వోం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఇప్పటికే బీజేపీ నేతలను కోరారు.
2.తితిదే ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట
తితిదేలో స్థానికులకు పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ అంతకన్నా కింది స్థాయి పోస్టులను స్థానికులతోనే భర్తీ చేసే ప్రతిపాదనకు ఇటీవల ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. 75 శాతం చిత్తూరు జిల్లాలోని స్థానికులకు కేటాయించేలా అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ఈ అంశాన్ని తితిదే ప్రత్యేక ఆహ్వానితుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ప్రస్తావించారు. జూనియర్ అసిస్టెంట్తో పాటు దిగువన అటెండర్, మజ్దూరు, రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
3.వెన్నెల కాంతులు వన్నెల దీపాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాష్ట్రంలోని వివిధ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునుంచే ఆలయాల వద్ద కోలాహలం నెలకొంది. భక్తులు నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. రాత్రి దేవాలయాల్లో దీపోత్సవాలు నిర్వహించారు. మంగళవారం ఒక్కరోజే యాదాద్రి ఆలయంలో 1800 సత్యనారాయణ వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బాలాలయంలో వైష్ణవ ఆచారంగా మధ్యాహ్నం అన్నకూటోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం క్షీరాద్రిపైన ఇనుపగిన్నెలో అఖండజ్యోతిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెలిగించారు.
4.కమనీయం.. లక్ష్మీనృసింహుని రథోత్సవం
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రానికి అయిదు కిలోమీటర్ల దూరాన ఉన్న శ్రీమన్నింబాచలక్షేత్రం లింబాద్రిగుట్టపై లక్ష్మీనరసింహుని రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథ భ్రమణం కొనసాగింది. పుష్పాలంకృత పల్లకీలో కొలువైన స్వామివారి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భక్తులు ఊరేగించారు.
5.బాసర అమ్మవారికి ముత్యాలహారం
బాసర సరస్వతీ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన అశోక్రెడ్డి-వాసవి దంపతులు మంగళవారం రూ.6 లక్షల విలువ చేసే 171 గ్రాముల బంగారు ముత్యాల హారాన్ని కానుకగా ఇచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అధికారులకు దీన్ని అందించారు.
6.తితిదే ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే
తితిదేలో స్థానికులకు పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ అంతకన్నా కింది స్థాయి పోస్టులను స్థానికులతోనే భర్తీ చేసే ప్రతిపాదనకు ఇటీవల ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. 75 శాతం చిత్తూరు జిల్లాలోని స్థానికులకు కేటాయించేలా అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ఈ అంశాన్ని తితిదే ప్రత్యేక ఆహ్వానితుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ప్రస్తావించారు. జూనియర్ అసిస్టెంట్తో పాటు దిగువన అటెండర్, మజ్దూరు, రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
7.వెన్నెల కాంతులు వన్నెల దీపాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాష్ట్రంలోని వివిధ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునుంచే ఆలయాల వద్ద కోలాహలం నెలకొంది. భక్తులు నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. రాత్రి దేవాలయాల్లో దీపోత్సవాలు నిర్వహించారు. మంగళవారం ఒక్కరోజే యాదాద్రి ఆలయంలో 1800 సత్యనారాయణ వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బాలాలయంలో వైష్ణవ ఆచారంగా మధ్యాహ్నం అన్నకూటోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం క్షీరాద్రిపైన ఇనుపగిన్నెలో అఖండజ్యోతిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెలిగించారు.
8. శ్రీవారి లడ్డూ ప్రియం!
తిరుమల శ్రీవారి లడ్డూ ధర రెట్టింపు కా నుంది. ఈ లడ్డూల పంపిణీ, విక్రయాల్లో ఇప్పటివరకూ ఉన్న రాయితీలన్నిటినీ రద్దు చేయాలని టీటీడీ యోచిస్తోంది. ఇకపై దర్శనం చేసుకున్న భక్తులందరికీ 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఒకటి ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది. ఆపైన ప్రతి లడ్డూ రూ.50కి విక్రయించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉచిత దర్శనాలు, రూ.300, వీఐపీ బ్రేక్ టికెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే భక్తులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ద్వారా లడ్డూల విక్రయాల్లో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.
9. శబరిమలలో 10వేల మంది పోలీసులతో భద్రత
కేరళ రాష్ట్రంలోని శబరిమలలో మండల పూజ ప్రారంభం సందర్భంగా ఈ నెల 16వతేదీ నుంచి ఆలయం తెరుస్తున్న నేపథ్యంలో కేరళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్ 28 న తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా భక్తులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా ఆలయంలో పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మండల పూజ కోసం ఈ నెల 16 వతేదీ నుంచి అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తున్న దృష్ట్యా కేరళ పోలీసులు పదివేలమందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.24 మంది ఎస్పీలు, ఏఎస్పీలు, 112 మంది డీఎస్పీలు,264 మంది ఇన్స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 8,402 మంది సివిల్ పోలీసులు, 307 మంది మహిళా పోలీసులను అయ్యప్ప దేవాలయ కాంప్లెక్స్ వద్ద బందోబస్తు కోసం నియమించారు.కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధిగమించడానికి చట్టాలు రూపొందించడం సాధ్యం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. మొత్తంమీద భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఏడాది అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజ ప్రారంభం కానుంది.
10. శబరిమల దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, పోలీస్ శాఖ, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఒక ఆన్లైన్ (http.//sabirimalaonline.org) పోర్టల్ను రూపొందించింది. దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్లను, స్వామివారి ప్రసాదాలను ఉచితంగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో రెండు రకాల దర్శనాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవచ్చు. భక్తుల వ్యక్తిగత సమాచారము, వయస్సు, చిరునామా, ఆధార్ కార్డ్, ఫొటో గుర్తింపు కార్డులను సమర్పించాలి. బుకింగ్ పూర్తి అయిన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికునికి ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్ ద్వారా దర్శనం తేదీ, సమయం, స్లాట్ వివరాలను ఈ-మెయిల్లో పంపిస్తారు. వీటి సాయంతో సదరు యాత్రికుడు తనకు వచ్చిన బార్కోడ్ ఉన్న టికెట్ను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ టికెట్ను, రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన ఫొటో గుర్తింపుకార్డును యాత్రికులు దర్శనానికి వెళ్లేటప్పుడు తమ వెంట కచ్చితంగా తీసుకువెళ్లాలి.
11. కనుల పండువగా జ్వాలాతోరణం కార్యక్రమం
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి రాజన్న ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, అధికారులు కనులపండువగా నిర్వహించారు. రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు, అధికారులు, పలువురు రాజకీయనాయకులు పల్లకిలోని ఉత్సవమూర్తులు, జ్వాలాతోరణానికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీకమాసంలో అగ్నిదేవతలను సంతోషపెట్టడం కోసం, కృత్తికా నక్షత్రంలోని కార్తీకపౌర్ణమి రోజు ఇలాంటి జ్వాలాతోరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పండితులు పేర్కొంటున్నారు.
పౌర్ణమి ఘడియలలో ఈ జ్వాలాతోరణం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణవేణి, ఆలయ వేదపండితులు, అర్చకులు, ఆలయ ఏసీ ఉమారాణి, ఆలయ డీఈ రాజేశ్, ఎలక్ట్రికల్ ఏఈ ద్వారకా శేఖర్, ఏఈ నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేశ్, టీఆర్ఎస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్, రాపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు నాగుల విష్ణు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
12. కందికొండ జాతరకు పోటెత్తిన భక్తులు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కందగిరి కొండపై జరిగే కందికొండ శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరకు జిల్లా నలుమూలల నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కదలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
13. వేయి స్తంభాల గుడిలో వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు
వరంగల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. చారిత్రక రుద్రేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులంతా క్యూలైన్లో ఓం నమఃశివాయ అంటూ శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు నంది విగ్రహం వద్ద భక్తులు బారులు తీరి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్-రేవతి దంపతులు, వరంగల్ తహసీల్దార్ బాబుసీమ్ తదితరులు పాల్గొన్నారు.
14. శ్రీరస్తు శుభమస్తు
తేది : 13, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సౌమ్యవాసరే (బుధవారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి
(నిన్న రాత్రి 7 గం॥ 4 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 42 ని॥ వరకు పాడ్యమి తిధి తదుపరి విదియ తిధి)
నక్షత్రం : కృత్తిక
(నిన్న రాత్రి 8 గం॥ 51 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 1 ని॥ వరకు కృత్తిక నక్షత్రం తదుపరి రోహిణి నక్షత్రం)యోగము : (వరీయాన్ ఈరోజు ఉదయం 10 గం ll 4 ని ll వరకు తదుపరి పరిఘ రేపు ఉదయం 9 గం ll 13 ని ll వరకు)
కరణం : (బాలువ ఈరోజు ఉదయం 7 గం ll 23 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మధ్యాహ్నం 12 గం ll 0 ని ll)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 7 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 11 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 20 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : వృషభము
15. నేటి సుభాషితం
తన విధిని విడిచిపెట్టే పని వాడితో, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయని బంధువులతో, దుఃఖంలో ఉన్నప్పుడు దూరంగా వుండే స్నేహితుడుతో మరియు దుారదృష్టిలో కలిసి వుండని భార్య/భర్తతో దూరంగా ఉండండి.
16. నేటి జాతీయం
కొంగున ముడి వేసుకున్నది
ఉదా: ఆమె తన మొగుడిని కొంగున ముడి వేసుకున్నది.
తన అదుపులో ఉంచుకున్నదని అర్థం
17. నేటి సామెత
పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుంది
మొహమాటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట. మొహమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.
18. నేటి ఆణిముత్యం
వరి పంటలేని యూరును
దొరయుండని యారు తోడు దొరకని తెరువున్‌
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
తాత్పర్యం:

ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.
19. మన ఇతిహాసాలు -ఆది పర్వము
వ్యాసుడు రచించిన, మహాభారతములో మొత్తం 18 ఉపపర్వాలు, 8 అశ్వాసాలు ఉన్నాయి. సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం 9,984 శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి 2,084 ఉన్నాయి.
మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలలో విషయ క్రమణిక ఇలా ఉంది.
1.ఆది పర్వము: పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
2.సభా పర్వము: కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
3.వన పర్వము (లేక) అరణ్య పర్వము: అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
4.విరాట పర్వము: విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
5.ఉద్యోగ పర్వము: కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
6.భీష్మ పర్వము: భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
7.ద్రోణ పర్వము: ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
8.కర్ణ పర్వము: కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
9.శల్య పర్వము: శల్యుడు సారథిగాను, అనంతరం నాయకునిగాను సాగిన యుద్ధం. దుర్యోధనుని మరణం.
10.సౌప్తిక పర్వము: నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
11.స్త్రీ పర్వము: గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
12.శాంతి పర్వము: యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
13.అనుశాసనిక పర్వము: భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
14.అశ్వమేధ పర్వము: యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
15.ఆశ్రమవాస పర్వము: ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
16.మౌసల పర్వము: యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
17.మహాప్రస్ధానిక పర్వము: పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
18.స్వర్గారోహణ పర్వము: పాండవులు స్వర్గాన్ని చేరడం.
వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. ఇవి కాక తరువాతి కథ అయిన శ్రీకృష్ణుని జీవితగాథను తెలుగు మహాభారతంలో భాగంగా కాక హరివంశ పర్వము అనే ప్రత్యేక గ్రంథంగా పరిగణించారు. నన్నయ మొదలుపెట్టిన కథావిభాగాన్నే తిక్కన, ఎఱ్ఱన అనుసరించారు.ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.
శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.
ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.

రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్
ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.
ఉపపర్వాలు
మహా భారతంలోని మొత్తం 100 ఉపపర్వాలలో 19 ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు
.అనుక్రమణికా పర్వం (పర్వాల సంగ్రహం)
2.పౌష్యం
3.పౌలోమం
4.ఆస్తిక పర్వం
5.ఆదివంశావతరణం
6.సంభవ పర్వము
7.లాక్షాగృహ దహనం
8.హిడింబాసురని వధ
9.బకాసురుని వధ
10.చైత్రరథం
11.ద్రౌపదీ స్వయంవరం
12.వైవాహిక పర్వము
13.విదురాగమనం
14.రాజ్యలాభ పర్వం
15.అర్జునుని వనవాసం
16.సుభద్రా కల్యాణం
17.హరణ హారిక
18.ఖాండవ వన దహనం
19.మయసభా దర్శనం
ఆంధ్ర మహాభారతం
అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు
20. శబరిమలలో 10 వేల మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీనుంచి మూడు నెలలపాటు శబరిమలలో అయ్యప్ప స్వామి పూజలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి వస్తారు. 24 మంది ఎస్‌పిలు, ఎఎస్‌పిలు, 112 మంది డిప్యూటీ ఎస్‌పిలు, 264 మంది ఇన్‌స్పెక్టర్లు, 1185 మంది సబిన్‌స్పెక్టర్లను శబరిమలలో విధుల నిర్వహణకు ప్రభుత్వం పంపింది. అలాగే 307 మంది మహిళా పోలీసులతో సహా 84-2 మంది సివిల్‌ పోలీస్‌ అధికారులను శబరిమల ఆలయం వద్ద భద్రత కోసం నియమించారు.
21. టిటిడి విజిలెన్స్ అదుపులో మరో ఉద్యోగి … ఎన్నారై కోటాలో అక్రమంగా ముగ్గురు భక్తులును దర్శనానికి అనుమతిస్తూ పట్టుబడ్డ సినియర్ అసిస్టెంట్ ఉద్యోగి. విచారణ జరుపుతున్న విజిలేన్స్ అధికారులు.