Food

చలికాలం సూప్‌లతో మజా మజా

Winter Soups Indian Style Recipes-Telugu Easy Fast Short Recipes

చలికాలంలో ఆహారం వేడిగా తినాలనిపిస్తుంది. ఈ కాలంలో సాధారణంగా జలుబు, దగ్గు ఉంటాయి కాబట్టి వేడి వేడి సూప్స్‌ ఉపశమనాన్ని ఇస్తాయి. సూప్స్‌లో హీలింగ్‌ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ సీజన్‌లో వాటిని తాగడం మంచిది. మనం ఇళ్లలో రెగ్యులర్‌గా చేసుకునే రసం, సాంబారు కూడా సూప్స్‌లాగే పనిచేస్తాయి. మీకోసం ఇక్కడ నాలుగు రకాల సూప్స్‌ ఇస్తున్నాం. వాటిని తయారుచేయడం చాలా సులువు. పైగా అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బలాన్నిస్తాయి.
*పాలకూర సూప్‌
కావాల్సినవి: కప్పు గ్రైండ్‌ చేసిన పాలకూర, తగినంత ఉప్పు, మిరియాల పొడి, టీ స్పూన్‌ నెయ్యి లేదా వెన్న.
తయారీ: స్టవ్‌ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి, కరిగిన తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి, ఆ తర్వాత గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పాలకూర పేస్టు వేసి, కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత కప్పు నీళ్లు పోసి మరిగిన తర్వాత సర్వ్‌ చేయాలి.
*క్యారెట్‌ సూప్‌
కావాల్సినవి: అరకప్పు ఉడకబెట్టి గ్రైండ్‌ చేసిన క్యారెట్‌, పావు కప్పు ఉడకబెట్టి మెదిపిన కందిపప్పు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, నూరిన మిరియాలు, ఉప్పు, నెయ్యి, రెండు కప్పుల నీళ్లు.
తయారీ: స్టవ్‌ మీద పాన్‌లో నెయ్యి వేడెక్కిన తర్వాత మిరియాలు, ఉప్పు, క్యారెట్‌ పేస్ట్‌ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. వెల్లుల్లి, అల్లం, కందిపప్పు, నీళ్లు వేసి మరిగిన తర్వాత వేడివేడిగా సర్వ్‌ చేయాలి.