NRI-NRT

డెట్రాయిట్‌లో యార్లగడ్డ జన్మదిన వేడుకలు

Yarlagadda Lakshmiprasad Birthday Celebrations In Detroit

రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీ అధికార భాష సంఘ అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 66వ జన్మదిన వేడుకలు అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో స్థానిక జోనింగ్ బోర్డు చైర్మన్, ప్రవాసాంధ్రుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు నేతృత్వంలో ఆయన నివాసంలో ఆత్మీయుల నడుమ ఘనంగా నిర్వహించారు. 67వ సంవత్సరంలోకి అడుగిడుతోన్న తనకు ఆత్మీయులు, స్నేహితులు, శిష్యులే బలము బలహీనతలని ఈ సందర్భంగా యార్లగడ్డ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల నుండి తనకు శుభాభినందనలు తెలిపిన మిత్రులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం కేక్ కోసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో NRI ఆసుపత్రి వ్యవస్థాపక సంచాలకులు డా.ముక్కామల అప్పారావు, టాటా మాజీ అధ్యక్షుడు డా.హరనాథ్ పొలిచెర్ల, అమెరికన్ తెలంగాణా సంఘం అధ్యక్షుడు కుకునూర్ వినోద్, తానా నుండి పంత్ర సునీల్, సురేష్ పుట్టగుంట, దుగ్గిరాల కిరణ్, ఎస్వీ ఆలయం నుండి కాట్రగడ్డ సుధాకర్, చాపలమడుగు ఉదయ్, గుళ్లపల్లి రవి, కోనేరు శ్రీనివాస్, బాలశెట్టి, ట్రాయి తెలుగు సంఘం నుండి చెంచురెడ్డి, బేతంచెర్ల ప్రసాద్, దురైరాజన్ రాజగోపాల్, ఆలపాటి కృష్ణప్రసాద్, అమెరికన్ కన్నడ కూట ఛైర్మన్ అమరనథ్ గౌడ, ఇండియన్ లీగ్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు వెన్నిలం జార్జి, డెట్రాయిట్ తెలుగు సంఘం ఉపాధ్యక్షుడు బొప్పన ద్వారకాప్రసాద్, కోశాధికారి ఉప్పలపాటి రావు, డెట్రాయిట్ రెస్టారెంట్ల సమాఖ్య నుండి గుత్తా వెంకటేశ్వరరావు(రావు గారి విందు), మండవ రవి(ప్రియా), సతీష్ రాధాకృష్ణన్(మసాలా), ఫోర్డ్ మోటార్స్ నుండి ఇంజేటి సత్య, గుబ్బల జ్ఞానేశ్వర్, దాసరి శ్రీనివాస్, దంతులూరి రాజు, కొండల్ జిన్నా, సాయిబాబా ఆలయ మాజీ ఛైర్మన్ కోనేరు మోహన్, డెట్రాయిట్ తెలుగు సంఘ మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసన్ తదితరులి పాల్గొన్నారు. దావత్ వారి విందు రుచికరంగా అలరించింది.