DailyDose

CBN Army పేజీపై వైకాపా కేసు-నేరవార్తలు-12/11

YSRCP Lodges Complaint On CBN Army Facebook Page-Telugu Crime News-12/11

* సోషల్ మీడియాలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివకుమార్ అనే వ్యకి ఫిర్యాదు చేసిన పట్టణ వైసీపీ నేతలు. ఛ్భ్ణ్ ఆర్మీ అనే ఫేస్ బుక్ పేజీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలియచేసారు. ఇటువంటి అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన శివ కుమార్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు దొంతి రెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, పట్టణ గౌరవ అధ్యక్షులు కేళి వెంకటేశ్వరావు, ప్రధాన కార్యదర్శి గోరేబాబు, ఎస్సి సెల్ నాయకులు మాచర్ల అబ్బు, మేకా అంజి రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

* ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బాగ్రాం వైమానిక కేంద్రంలో బుధవారం సంభవించిన పేలుడులో 30 మంది ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బగ్రాం జిల్లాలో నాటో కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని గతంలో కారు బాంబు పేలింది. బగ్రాం వైమానిక కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనంపై తాలిబన్లు దాడి చేశారు. ఈ పేలుడుతో బగ్రాం వైమానిక కేంద్రానికి వచ్చే రోడ్డును మూసివేశారు. సాయుధ దళాలకు చెందిన జవాన్లు అప్రమత్తమై పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

* 2002లో గోద్రా రైలు దహనం తర్వాత జరిగిన అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని నాటి గుజరాత్ సర్కార్‌కు క్లీన్ చిట్ లభించింది. అల్లర్లకు.. అప్పటి మోదీ సర్కార్‌కు ఎలాంటి సంబంధం లేదని నానావతి – మెహతా కమిషన్ తెలిపింది. గుజరాత్ అసెంబ్లీకి తమ నివేదికను బుధవారం సమర్పించిన ఈ కమిషన్.. ఆ అల్లర్లు సంస్థాగతంగా జరిగినవి కావని తేల్చిచెప్పింది. 2002 ఫిబ్రవరి 27న అల్లరి మూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టాయి. దీంతో ఎస్-6 కోచ్‌లో ప్రయాణిస్తున్న మొత్తం 59 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులే అత్యధికంగా ఉన్నారు. ఈ ఘటన కారణంగా గుజరాత్‌లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణహోమం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.

* బస్సులో వెళ్తున్న ఓ యువతికి బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడు వెల్లూరులో జరిగింది. అంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్​ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని కళాశాల రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెకు ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఇటీవలే ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది. విషయం తెలుసుకున్న జగన్​.. యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. ఆమె నిరాకరించడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయాడు. మంగళవారం ఉదయం ఆ యువతి అంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో వెళుతుండడం చూసి తను కూడా వాహనం ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న తాళిని ఆమెకు బలవంతంగా కట్టే ప్రయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడం వల్ల తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. జగన్​ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితునిపై కేసు నమోదుచేశారు.

* కారును ఢీకొన్న లారీ నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు కడప జిల్లా రామాపురం మండలం కొండవాండ్ల పల్లె వద్ద చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కారు(ఇస్తిక) ను లారీ డీకొంది. ఈ ప్రమాదంలో రాయచోటి కి చెందిన పైవ్ స్టార్ పైపుల ఫ్యాక్టరీ యజమాని కుటుంబ సభ్యులు హర్షద్, హాసజీరా తోపాటు చిత్తూరు జిల్లా కలికిరి కి చెందిన హారున్ బాష, అఫిరా అనే నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రొద్దుటూరు నుండి రాయచోటి కి పోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రామాపురం ఎస్ఐ మైనుద్ధీన్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టోమార్టం నిమిత్తం మృతదేహాలను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* పెంచిన ఆర్టిసి చార్జిలను తగ్గించాలని కోరుతూ నందిగామ ఆర్టిసి బస్ స్టాండ్ ముందు నిరసన వ్యక్తం చేసిన మాజి యం ఎల్ ఎ తంగిరాల సౌమ్య, పార్టీ నాయకులు… పెంచిన ఆర్టిసి చార్జిలను తగ్గించాలని కోరుతూ నందిగామ నుంచి కంచికచర్ల వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణం చేసిన నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.

* గుంటూరు అర్బన్ పరిధిలోని డొంక రోడ్ మూడు వంతెనల దగ్గర లారీ ప్రమాదానికి గురైంది. వాహన రాకపోకలను నిలిపివేశారు. ఇరువైపులా అక్రమాలు వుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.