Health

శృంగార సమస్యలు-వాటి పరిష్కారాలు

Mood And Emotional Problems Between Couples And How To Tackle Them

*** ఆరోగ్యకరమైన శృంగార జీవితంలో అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

మీరు మీ భాగస్వామితో చివరిసారిగా ప్రేమగా ఎప్పుడు మాట్లాడారు? మీరు మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొని చాలా కాలం అవుతోందా. అసలు ఆ కార్యం ఎప్పుడు జరిగిందో కూడా మీకు గుర్తు లేదా? అయితే మీ రిలేషన్ షిప్ లో అలౌకిక సంబంధం సాగుతుంది అని చెప్పేందుకు స్పష్టమైన సంకేతం.

అయితే ఇలాంటి అలౌకిక సంబంధం అనేది జంటలు ఎక్కువ కాలం లైంగిక చర్యలకు పాల్పడని సమయంలోనే జరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన లైంగిక జీవితాన్ని గడిపేందుకు మరియు అలౌకిక సంబంధానికి గుడ్ బై చెప్పేందుకు మేము కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము. అవేంటో ఈ స్టోరీలో చూసేయండి.. మీ శృంగార జీవితాన్ని హాయిగా కొనసాగించండి… మంచిగా మాట్లాడండి… జంటల మధ్య అలౌకిక సంబంధం అనేది గదిలో చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే మీరు పడక గదిలో చేరుకున్నాక మీరు మీ భాగస్వామితో మంచిగా మాట్లాడండి. మీరిద్దరూ శృంగారం గురించి ఏ విధంగా భావిస్తున్నారో చర్చించుకోండి. మీ జీవితంలో ఇప్పటివరకు లైంగికంగా తప్పిపోయిన వాటిని గమనించండి. (ఇది మీ గురించి లేదా మీ భాగస్వామి గురించి అయినా) మీ ఇద్దరిలో ఎవరికి కోరిక కలిగినా మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వాటి గురించి మాట్లాడండి. నిజాయితీగా ఉండండి. అయితే కేవలం దీని గురించే మట్లాడి ఒత్తిడి మాత్రం చేయకండి. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోండి.

వాస్తవ అంచనాలు..

ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యాన్ని అనేది పెట్టుకుంటారు. అయితే వాటిని చేరుకోలేకపోతే నిరాశకు గురవుతారు. ఇది కూడా మీ శృంగార జీవితాన్నిప్రతిబింబిస్తుంది. దీని అర్థం మీరిద్దరిలో ఒకరు శృంగారం కోరుకోవడం లేదా ‘‘స్థిరపడటం‘‘ కాదు. మీరు మీ లైంగిక జీవితాన్ని ఎలా వాస్తవమైన అంచనాలతో పాటించాలని దీని అర్థం. అలాగే మీరు టివిలో (లేదా అసభ్యకరంగా) ప్రతిసారీ ఆకస్మిక, బలవంతమైన శృంగారం కలిగి ఉన్న జంట కాదని అంగీకరించడం. అనవసరమైన వాటికి ప్రాధాన్యత.. కొంత మంది భాగస్వాములు పరిమాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలా మంది జంటలు నెలలో కేవలం ఒకటి లేదా రెండు సార్లు శృంగారంలో పాల్గొంటుండవచ్చు. అయితే కొంత మంది జంటలకు దీని వల్ల మంచి సుఖం లభించినప్పటికీ సాధ్యమైనంత వరకు మీరు మరింత ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నం చేయండి. మీరు అలాంటి సమయాన్ని కలయిక కోసం ఉపయోగించుకుంటే మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది. దీని వల్ల మీ మధ్య దూరం బాగా తగ్గుతుంది. మీరు ఎక్కువ కాలం ఒంటరిగా ఉన్నట్లు అనిపించదు.

భావోద్వేగ సంబంధం…

మీ భావోద్వేగ జీవితం మరియు లైంగిక జీవితం ఒకదానితో ఒకటి అవినాభవ సంబంధం కలిగి ఉన్నాయి. మీరు శృంగారాన్ని దీర్ఘకాలికంగా తగ్గిస్తే, అది మీ జీవితంలో చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అందుకే మీరు మీ భాగస్వామితో మరింత సాన్నిహిత్యంగా ఉండేందుకు సరదా సంభాషణలు చేస్తూ ఉండండి. మీ రిలేషన్ షిప్ ఎలా కావాలనుకుంటున్నారో ఒకరినొకరు అడగండి. మీ ఆలోచనలు, భావాలను ఒకరితో ఒకరు పంచుకోండి. కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఒకరినొకరు అభినందించుకోండి. దీంతో పాటే మీరు శృంగారానికి ఎంతగా విలువ ఇస్తారో మాట్లాడుకోండి.

ఫోర్ ప్లే మ్యాజిక్..

చాలా మంది జంటలు ఫోర్ ప్లే మ్యాజిక్ దాటేసి లవ్ మేకింగ్ పార్ట్ లోకి దూకేస్తారు. ఫోర్ ప్లే వల్ల టైమ్ వేస్ట్ అని అనుకుంటారు. అయితే ఇది వాస్తవం కాదు. ఫోర్ ప్లే నిజంగా లైంగిక జీవితానికి చాలా కీలకమైనది. ఫోర్ ప్లే సమయంలోనే మీరు మీ భాగస్వామి యొక్క ప్రాధాన్యతలను తెలుసుకోగలుగుతారు. శాశ్వత శృంగార ఆనందాన్ని పొందేందుకు అతి ముఖ్యంగా సహాయపడేది తీవ్రమైన ఫోర్ ప్లేనే. మీరు ఒకరికొకరు ప్రేమను, అభిరుచిని కూడా పంచుకోవచ్చు. పెంచుకోవచ్చు.

టూర్ ప్లాన్ చేయండి…

మీ లైంగిక జీవితాన్ని ప్రారంభించడానికి మీకు మరియు మీ భాగస్వామికి ప్లేస్ యొక్క మార్పు అవసరమని అని మీరు భావిస్తే మీరిద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్ చేయడం చాలా మంచిది. విహారయాత్రకు వెళ్లడం వల్ల మీరు కొత్త స్థలాన్ని అన్వేషించడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా మీ భాగస్వామితో కొన్ని ప్రైవేట్ క్షణాలను ఆస్వాదించడానికి మీకు చక్కటి అనుమతి లభిస్తుంది. ఇది కూడా అలౌకిక సంబంధాన్ని ముగించేందుకు ఉపయోగపడవచ్చు. పిల్లలు లేదా ఉమ్మడి కుటంబాలలో నివసిస్తున్న జంటలు ఎలాంటి జోక్యం లేకుండా వారి ఒంటరి సమయాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చు. నాణ్యతపై దృష్టి పెట్టాలి.. మీ లైంగిక జీవితానికి సంబంధించి మీరు పరిమాణం కంటే నాణ్యతపై దృష్టి పెట్టాలి. మీ రిలేషన్ షిప్ లో నాణ్యత అనేది లేకపోతే చాలా మంది శృంగారంలో సరిగా పాల్గొనలేరు. నాణ్యతపై శ్రద్ధ వహించడం వల్ల మీ ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి ఇది బాగా సహాయపడుతుంది. చాలా మంది జంటలు ఇది నిజం కాదని అనుకుంటారు. అయితే మీరు మీ భాగస్వామి కోరికలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మీ ఇద్దరికి గొప్ప ప్రయోజనం కలిగిస్తుందని గుర్తంచుకోండి.