NRI-NRT

కేటీఆర్‌కు ఎన్నారై తెరాస అభినందన

NRI TRS Co-Ordinator Mahesh Bigala Congratulates KTR

మంత్రి కేటీ రామారావు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడుగా మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్బంగా టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఎన్నారైలందరి తరుపున శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నారైలందరం ప్రచారం చేస్తామని చెప్పారు.టిఆర్ఎస్ పార్టీని పంచాయతీ, జిల్లాపరిషత్ ఎన్నికలలో గెలిపించిన విధంగానే మున్సిపల్ ఎన్నికలలో కూడా మంత్రి కేటీఆర్‌ పార్టీని విజయ తీరాలకు చేర్చుతారన్నారు. కేటీఆర్‌ నేతృత్వంలో పార్టీ రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా మరింత బలమైన శక్తిగా ఎదగాలని మహేష్ ఆకాక్షించారు.