ScienceAndTech

అంతర్జాల దైనందిని వాడండి

Get into the habit of writing your online diary

కాలం చాలా విలువైంది అది ఎవరి కోసం ఆగదు. కాలం ముందు పేదలు, ధనవంతులు అందరూ సమానమే. పోయిన కాలం తిరిగిరాదు. అయితే ఈ కాలం కొన్ని మధుర క్షణాలు, చేదు గుర్తులను మిగులుస్తుంది. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో జరిగే ఎన్నో జ్ఞాపకాలు, ఘటనలు గుర్తు పెట్టుకోవడం అంత సులువు కాదు. కాలగర్భంలో కలిసిపోయే ఎన్నో మధుర క్షణాలను, చేదు గుర్తులను కాపాడే భాండాగారమే డైరీ. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెంది కంప్యూటర్ల యుగం వచ్చినప్పటికీ డైరీకి ఉన్న ప్రత్యేకత తగ్గలేదు. అనుభూతుల పొదరిల్లుగా, గత జ్ఞాపకాలను గుర్తుచేసే తాళ పత్రాలుగా డైరీలు ఎప్పటికీ నిలుస్తాయి.

*** కాలం గడిచిపోతోంది..
ఏండ్లు గడిచిపోతున్నాయి. కొత్త సంవత్సరాలు వస్తున్నాయి. కాలం కొన్ని జ్ఞాపకాలను మిగిల్చిపోతుంది. డైరీలు వీటిని దాచిపెడుతాయి. అయితే ఓసారీ వీటిని తిరగేస్తే మన జీవితంలో వచ్చిన ప్రతిబంధకాలు ఏవో తెలిసిపోతుంది. అయితే నేటి ఆధునిక యుగంలో కూడా డైరీకి ప్రాధాన్యత తగ్గలేదు. మనిషి దైనందిన జివితంలో వివిధ సందర్భాలకనుగుణంగా వివిధ పరిస్థితుల్లో అనేక రకాలుగా అనుభూతులు పొందుతాడు. వాటిని డైరీలో రాసి ఓ మంచి అనుభూతితో ముడిపెట్టుకొని మధుర జ్ఞాపకంగా స్థిర పర్చుకుంటాడు. అయితే నేటి ఆధునిక యుగంలో కొందరు తమ దినచర్యను ఆన్‌లైన్‌లోనే స్థిరపర్చుకుంటున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేనివారు, రచనా చాతుర్యం ఉన్నవారు, రాయడం అలవాటు ఉన్నవారు నేటికీ డైరీలనే వాడుతున్నారు.

*** దినచర్యకు చిరునామా..
డైరీలు దినచర్యకు చిరునామాగా నిలుస్తున్నాయి. తాళపత్ర గ్రంథాలను పోలిన విధంగా అధ్యాత్మికత మదిలో మెదిలే విధంగా రోజువారీ తిథి, నక్షత్రం, ముహూర్తం వ్యవసాయం వంటి సమాచారం అందిస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల వివరాలతో రూపొందించిన డైరీలు హోంవర్క్‌ వంటి అంశాలతో పాటు వారిని ఆకట్టుకునే విధంగా క్రీడలు, రామాయణ గాధలను వివరించే ఆర్ట్‌ కవర్‌, మాస్టర్‌ క్రాప్ట్‌ డైరీలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

*** ఆన్‌లైన్‌ డైరీ..
ఇంటర్‌నెట్‌లో www.mydairy.org సైట్‌ను ఓపెన్‌ చేయాలి. సెట్‌లోకి వెళ్లాక కుడివైపున డైరీ లాగిన్‌ అని ఉంటుంది. దాని కింద నాట్‌ రిజిస్టర్‌ సైన్‌ ఆఫ్‌ టుడే అని ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయాలి. వెంటనే క్రియేట్‌ యువర్‌ ఓన్‌ డైరీ అని వస్తుంది. అక్కడ చూపిన బాక్స్‌లో మీ ఈ మెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేసి క్రియేట్‌ డైరీపై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ ఈ మెయిల్‌ ఐడీకి మై డైరీ నుంచి వెరిఫికేషన్‌ కోడ్‌ వస్తుంది. మీ ఈ మెయిల్‌ ఐడీని వెరిఫికేషన్‌ కోడ్‌పై క్లిక్‌ చేయగానే క్రియేట్‌ యువర్‌ ఓన్‌ డైరీ అని వస్తుంది. అందులో డైరీ పేరు, యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఖాళీలు కనిపిస్తాయి. వాటిలో సమాచారాన్ని నింపి డైరీపై క్లిక్‌ చేస్తే వెరిఫై ఈ మేయిల్‌ అడ్రస్‌ అని వస్తుంది. అక్కడ ఈ మెయిల్‌ ఐడీ అన్‌లైన్‌ డైరీ పేరు, ఆన్‌లైన్‌ డైరీ పాస్‌వర్డ్‌ సంబంధిత ఖాళీల్లో పొందుపర్చాలి. ఆ తర్వాత లాగిన్‌ పై క్లిక్‌ చేయగానే వెల్‌కం టు యువర్‌ డైరీ అని హోం పేజీ వస్తుంది. హోం పేజీపై వరుసలో హోం, రైట్‌, లుక్‌ఆఫ్‌, అకౌంట్‌, టిప్‌ఏ ఫ్రెండ్‌, డోనేషన్స్‌ కలర్‌ ప్రిఫరెన్స్‌ లాగవుట్‌ ఆష్షన్లు ఉంటాయి.

*** ఆకర్షణీయమైన డైరీలు..
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ఆకర్షణీయమైన డైరీలు మార్కెట్‌లో సందడి చేస్తుంటాయి. 2020నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో డైరీలు దర్శనమిస్తున్నాయి. పర్సనల్‌, బిజినెస్‌, కార్పొరేట్‌, రైతు, చిల్డ్రన్స్‌తోపాటు వివిధ రంగాల వారికి ఉపయోగపడే వివిధ రూపాల్లో ఆకర్షణీయమైన ముఖ చిత్రాలతో డైరీలు ఆకట్టుకుంటున్నాయి.

*** ఆనవాయితీగా డైరీల పంపిణీ..
డైరీ అనేది మన జ్ఞాపకాల గని. అలాంటి డైరీని వివిధ వ్యాపార సంస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తమ సహచరులకు అందించడం ఆనవాయితీగా వస్తుంది. వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి డైరీలు దోహదపడున్నాయి. అంతే కాకుండా తమ మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులకు డైరీలను తమ గుర్తుగా అందించి సంవత్సరం పాటు అవతలి వారి మనస్సులో నిలిచిపోతారు.

*** రాయండిలా..

ఆష్షన్లలో హోం రైట్‌పై క్లిక్‌ చేస్తే న్యూ డైరీ ఎంట్రి వస్తుంది. దాని కింద డేట్‌ , టైం, టైటిల్‌, టాపిక్‌ , ఎంట్రీ, సేవ్‌, ఎంట్రీ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. టైటిల్‌ డేట్‌ ఎంటర్‌ చేసి ఖాళీ బాక్సులో ఏ విషయాలైనా రాసుకోవచ్చు. అనంతరం బాక్స్‌పై ఉన్న సేవ్‌, ఎంట్రీపై క్లిక్‌ చేస్తే ఇక ఆ విషయాలు పదిలంగా ఉంటాయి. సేవ్‌ అయిన విషయం ఎంట్రీస్‌ తెరపై కనిపిస్తుంది. ఎంట్రీ కింద ఉన్న సేర్స్‌ బాక్స్‌లో సంబంధిత టైటిల్‌ లేదంటే డేట్‌ నింపి సెర్చ్‌ చేస్తే మీరు డైరీలో రాసిన అంశం వెంటనే కనిపిస్తుంది. ఆన్‌లైన్‌ డైరీ రాయడం పూర్తయిన తర్వాత తప్పకుండా కుడి వైపున ఉన్న లాగవుట్‌పై క్లిక్‌ చేసి సైట్‌ నుంచి బయటకు రావాలి. ఒకసారి ఆన్‌లైన్‌లో లాగిన్‌ అయిన తర్వాత నేరుగా ఆన్‌లైన్‌ డైరీ గురించి స్నేహితులకు చెప్పాలనుకుంటే టిప్‌ ఫర్‌ ఏ ఫ్రెండ్‌ క్లిక్‌ చేయగానే ఎక్స్‌టెల్‌ ఏ ఫ్రెండ్‌ అవుట్‌ దిస్‌ సైట్‌ అని వస్తుంది. అక్కడ ఉన్న బాక్స్‌లో స్నేహితుడి పేరు, మెయిల్‌ ఐడీ ఎంటర్‌ చేసి సెంట్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే సెండ్‌ అని టిప్‌ వస్తుంది. ఇదొక్క సైట్‌ మాత్రమే కాదు ఇంకా చాలా సైట్లు ఆన్‌లైన్‌ డైరీలను అందుబాటులో ఉంచుతున్నాయి.

*** ఆన్‌లైన్‌ డైరీల్లోనూ కేటగిరీలు..
మామూలు డైరీల్లాగానే ఆన్‌లైన్‌ డైరీల్లోనూ కేటగిరీలుంటాయి. ఆన్‌లైన్‌ ఈ- డైరీలో బిజినెస్‌, ఎగ్జిక్యూటివ్‌ హైస్‌బైబ్‌, ప్రొఫెషనల్‌ రా, పోగ్రామర్స్‌, స్టూడెంట్‌, యూత్‌, ప్రయాణికులు, రచయితలు తదితర కేటగిరీలు ఉన్నాయి. లిజన్‌ ఆఫ్‌ ఫ్రీ మ్యూజిక్‌ డైరీ, ఫుడ్‌ డైరీ ప్లానర్‌ తదితర రకాల డైరీలు కూడా ఉంటాయి. ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ డైరీని వినియోగించుకోవచ్చు.