WorldWonders

ట్రంప్ తలకు 8కోట్ల డాలర్ల నజరానా

Iran Announces Price For Trump's Head-World Wonders

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చంపేసిన‌వారికి 8 కోట్ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది. మిలిట‌రీ క‌మాండ‌ర్ సులేమానీ హ‌త్య నేప‌థ్యంలో ఇరాన్ ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇవాళ టెహ్రాన్‌లో సులేమాని అంతిమ‌యాత్ర కొన‌సాగింది. అక్క‌డ ట్రంప్ త‌ల‌పై వేలం విధించిన‌ట్లు తెలుస్తోంది. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఒక డాల‌ర్ విరాళం ఇవ్వాల‌ని, దాంతో ట్రంప్ నివ‌సించే వైట్‌హౌజ్‌పై దాడి చేస్తామ‌ని ఇరాన్ టీవీ ఛాన‌ళ్లు వార్త‌లు ప్ర‌సారం చేసిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. ఇరాన్‌లో సుమారు 8 కోట్ల జ‌నాభా ఉన్న‌ది. ఆ జ‌నాభా ఆధారంగా ట్రంప్ త‌ల‌పై వెల ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్‌ను హ‌త‌మార్చిన వాళ్ల‌కు ఆ రివార్డును బ‌హూక‌రిస్తార‌ని ప్ర‌క‌టించారు. సులేమానీ హ‌త్య నేప‌థ్యంలో ఇరాన్‌, అమెరికా మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. ఆ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ ఇప్ప‌టికే హెచ్చ‌రించింది.