ScienceAndTech

వెన్నెముకకి రోబో దన్ను

Robot Supporting Your Spine-Telugu SciTech

వెన్నెముకకు గాయాలైన రోగులు మరింత స్థిరంగా కూర్చోవడంలో సాయపడే ఒక రోబోటిక్‌ సాధనాన్ని అమెరికా పరిశోధకులు తయారు చేశారు. రోగులు వేగంగా కోలుకోవడానికి ఇది సాయపడుతుంది. దీని రూపకల్పనలో భారత సంతతి వైద్యుడు సునీల్‌ అగ్రవాల్‌ కూడా పాల్గొన్నారు. ఈ సాధనం పేరు ట్రంక్‌ సపోర్ట్‌ ట్రైనర్‌ (ట్రస్ట్‌). ఇది కేబుల్‌ సాయంతో నడిచే బెల్ట్‌. ఇందులో మోటారు కూడా ఉంటుంది. రోగులు ‘ట్రస్టు’ను నడుము చుట్టూ అమర్చుకోవాలి. కూర్చున్న సమయంలో సదరు భంగిమకు సంబంధించిన నియంత్రణ పరిమితుల గురించి తెలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. శరీర పైభాగంలోని కదలికలు.. సదరు భంగిమకు సంబంధించిన స్థిరత్వ పరిమితులను మించిపోతే ఇది శరీరంపై బలాలను ప్రయోగిస్తుంది. తద్వారా రోగి పడిపోకుండా చూస్తుంది. ఈ సాధనం వల్ల గరిష్ఠ స్థాయిలో శరీర కదలికలను రోగులు చేయగలుగుతారు. వ్యక్తి అవసరాలకు అనుగుణంగా దీనిలో మార్పులు చేయవచ్చు.