Movies

అనంతమైన సంతృప్తి

Katrina Kaif Supremely Happy With Her Career

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఆమె 2003వ సంవత్సరంలో ‘బూమ్’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. అనంతరం సల్మాన్‌ఖాన్ చిత్రం ‘మైనే ప్యార్ క్యూ కియా’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి సక్సెస్‌ను అందుకోవడంతో ఆ తర్వాత ఇక వెనక్కి చూసుకోకుండా బాలీవుడ్‌లో దూసుకుపోయింది. తెలుగులో ఈ అమ్మడు ‘మల్లీశ్వరి’ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక బాలీవుడ్‌లో దాదాపు టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈ అమ్మడు గత ఏడాది ‘భారత్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ అమ్మడు తన 15 ఏళ్ల సినీ కెరీర్‌పై చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పింది. కత్రినా కైఫ్ మాట్లాడుతూ “ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో నటించడం నాకు మంచి అనుభవాన్ని మిగిల్చింది. చెప్పలేనంత సంతృప్తిని పొందాను. సినిమాల వల్ల ఎన్నో ప్రాంతాలకు వెళ్లడంతో నేను పొందిన మానసిక ప్రశాంతతను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు దక్కిన ప్రతి పాత్రను ప్రేమించి చేసేందుకు నేను ప్రయత్నించాను”అని చెప్పింది.