Food

ఇనుము అధికంగా ఉన్న ఆహారం ఇది

Food that has lot of iron-Telugu food and diet news

హిమోగ్లోబిన్‌ తగ్గినపుడు చాలా మంది ఐరన్‌ టాబ్లెట్లు వాడుతుంటారు. రకరకాల మందులు, టానిక్‌లు వాడుతుంటారు. ఎంతసేపు ఈ మందులు వాడటమే మనకు తెలుసు. మనచుట్టూ ఉండే ఆహార పదార్థాల్లోనూ ఐరన్‌ ఉంటుందని చాలా మందికి తెలియదు. హిమోగ్లోబిన్‌ పెరగాలంటే ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. మందులు వాడితే సైడెఫెక్ట్స్‌ ఉంటాయి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సైడెఫెక్ట్స్‌ ఉండవు. రోజుకు పురుషులకు 28 మి.గ్రా, స్త్రీలకు 30 మి.గ్రా. ల ఐరన్‌ కావాలి. స్త్రీలకు పురుషుల కన్నా ఎక్కువ కావాలి. ఎందుకంటే వారికి రుతస్రావం అయినపుడు ఎక్కువగా రక్తం పోతుంది. అందుకే మగవారికన్నా ఆడవారే ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా గర్భినీ స్త్రీలు ఎక్కవ ఐరన్‌ ఉన్న ఫుడ్‌ తినాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా జన్మించాలంటే ఐరన్‌ ఎంతో అవసరం. ఏ ఆహారాల్లో ఐరన్‌ ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం
*ప్రతి 100 గ్రాముల ఆహారంలో ఐరన్‌…
1. గోదుమలు – 5మి.గ్రా 2. బాదమ్‌ – 5మి.గ్రా 3. జీడిపప్పు – 6మి.గ్రా 4. వాటర్‌మిలన్‌ – 8మి.గ్రా 5. సజ్జలు – 8మి.గ్రా, 6. నువ్వులు – 9 మి.గ్రా 7. సెనగ పప్పు – 10మి.గ్రా 8. పుదీనా – 16మి.గ్రా 9. అటుకులు – 20మి.గ్రా 10. అవిసె ఆకులు – 29మి.గ్రా 11. తవుడు – 35మి.గ్రా 12. తోటకూర – 39మి.గ్రా 13. కాలీఫ్లవర్‌ కాడలు – 40మి.గ్రా 14. కొబ్బరి చెక్క – 69మి.గ్రా 15. అవిసె గింజలు – 100 మి.గ్రా
నోట్‌ : పైన చెప్పిన ఆహారం తినగానే మన బాడీలో తగిన ఐరన్‌ మోతాదు పెరగదు. తిన్న ఆహారంలో నుంచి మన శరీరం ఐరన్‌ను గ్రహించాలి. అయితే.. తినే ఆహారంలో నుంచి ఐరన్‌ను గ్రహించాలంటే మన శరీరంలో సి విటమిన్‌ ఉండాలి. సివిటమిన్‌ వండిన ఆహారంలో ఉండదు. పండ్లు, రసాలు వంటి వండని, పచ్చి వాటిలో సీ విటమిన్‌ ఉంటుంది. ఏరోజుకారోజు మన బాడీకి కావలిసిన సి విటమిన్‌ కావాలంటే రోజుకో జామకాయ గానీ, ఓ గ్లాసు బత్తాయి లేదా ఆరెంజ్‌ జ్యూస్‌ గానీ తీసుకుంటే సరిపోతుంది.

2.తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
సుబర్ణా ఘోష్ దంపతులు, తమకు పుట్టబోయే మొదటి బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కడుపుతో ఉన్నంతకాలం సుబర్ణ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాగైనా తనకు నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు.‘‘ఈరోజుల్లో అందరూ సిజేరియన్ డెలివరీలనే ఆశ్రయిస్తున్నారు. మీరెందుకు అంత బాధ భరించడానికి సిద్ధపడుతున్నారు? మీలాంటి చదువుకున్నవాళ్ళు ఆధునిక పద్ధతిని ఎన్నుకోవాలి కదా! అని మా డాక్టర్ నాతో అన్నారు” అంటూ సుబర్ణ మాట్లాడుతూ చెప్పారు.
డాక్టర్ మాట విని సుబర్ణా, ఆమె భర్తా ఆలోచనలో పడ్డారు. చివరికి సిజేరియన్ కోసం ఒప్పుకున్నారు. కానీ, దానివల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది.”ఆపరేషన్ అయ్యాక కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నాకు తగినన్ని పాలు పడేవి కావు. దాంతో నా బిడ్డకు పాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను” అని ఆమె గుర్తు చేసుకున్నారు.ఆ తరవాత సుబర్ణ ఆన్‌లైన్ ఫోరం Change.Org లో ఒక అభ్యర్థన పెట్టారు. తమ దగ్గర ఎన్ని సిజేరియన్ ఆపరేషన్లు అవుతున్నాయో, ఎన్ని నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయో తెలపాలంటూ ఆస్పత్రుల యాజమాన్యాలను ఆమె కోరారు.
*డాక్టర్లు ఏమంటున్నారు?
సిజేరియన్ తరవాత రికవరీకి ఎక్కువ టైమ్ పడుతుందనీ, అదే నార్మల్ డెలివరీ అయితే తొందరగా కోలుకుంటారనీ గైనకాలజిస్ట్ మధు గోయల్ అన్నారు.సిజేరియన్ వల్ల ఒక్కోసారి చాలా రక్తం పోతుంది. అలాంటప్పుడు నీరసపడిపోవడం, పాలు తయారవ్వకపోవడం, డిప్రెషన్‌కు లోనవ్వడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విపరీతంగా ఒళ్ళు రావడంతో పాటు డయాబెటిస్ బారినపడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.
“మా పని తేలికవుతుందనీ , డబ్బుకోసం సిజేరియన్లు చేస్తున్నామనీ డాక్టర్ల మీద చాలా సులువుగా ఆరోపణలు మోపుతారు.. కానీ అది నిజం కాదు. చాలామంది మహిళలు వజైనల్ డెలివరీలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి సిద్ధపడరు. వాళ్ళే సిజేరియన్ చేయమని మమ్మల్ని అడుగుతుంటారు” అని డాక్టర్ మధు అన్నారు.
చాలామంది డెలివరీకి ముహూర్తాలు చూసుకుని వస్తారు. వాళ్ళకు నచ్చిన తేదీ, ఘడియల్లోనే డెలివరీ కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు కూడా సి-సెక్షన్ తప్ప మరో మార్గం లేదు. కొందరు తల్లుల వయసు ఎక్కువగా ఉండటం, ప్రసవానికి ముందు వ్యాయామం చేయకపోవడం లాంటి కారణాలు కూడా సిజేరియన్‌కు దారితీస్తున్నాయి అని ఆమె చెబుతారు.”మారుతున్న జీవనశైలి ఈ పరిణామానికి ఓ ప్రధాన కారణం. ఈరోజుల్లో అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారు. సరైన వ్యాయామాలు కూడా చెయ్యట్లేదు. ఇలాంటప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడం కష్టమే!” అని ఆమె వివరించారు.
తల్లి.. బిడ్డను పుష్ చేయలేకపోయినా, లేదా తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అనిపించినా సిజేరియన్ చేయకతప్పదు.
*సిజేరియన్ డెలివరీలు ఎందుకు పెరుగుతున్నాయి?
నిజానికి మహిళల ఆరోగ్యానికి సిజేరియన్లు అంత మంచివికాకపోయినా, భారత్‌తో సహా అనేక దేశాల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది.
అందుకే, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైల్డ్ బర్త్ గైడ్‌లైన్స్‌లో కొన్ని మార్పులు సూచించింది. దీనిని “ఇంట్రాపార్టమ్ కేర్ ఫర్ ఎ పాజిటివ్ చైల్డ్‌బర్త్ ఎక్స్‌పీరియన్స్” (Intrapartum Care for a Positive Childbirth Experience) అని పిలుస్తారు.
‘‘నార్మల్ డెలివరీకి ఎక్కువ టైమ్ పడుతుంది. సిజేరియన్ త్వరగా అయిపోతుంది. అందుకే WHO గైడ్‌లైన్స్‌లో ‘మహిళల ప్రసవానికి ఎక్కువ సమయం కేటాయించాలి’ అని చేర్చారు’’ అని WHO హెల్త్ ఆఫీసర్ డా. ఒలుఫిమి ఒలాడాపో అన్నారు.అన్ని ప్రసవాలకూ “వన్ సెంటిమీటర్ రూల్” వర్తించదు అని కూడా ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
*ఈ వన్ సెంటిమీటర్ రూల్ ఏంటి?
ప్రసవ సమయంలో ప్రతి గంటకు బిడ్డ ఒక సెంటీమీటర్ కిందకు జరుగుతుంటుంది. దీన్ని మెడికల్ భాషలో “వన్ సెంటిమీటర్ రూల్” అంటారని డాక్టర్ మధు చెబుతారు.
*భారతదేశంలో సిజేరియన్లు
నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS), 1992-93 నుంచి 2015-16 వరకు నమోదైన డేటాను అధ్యయనం చేసింది. దీని ప్రకారం భారత్‌లో 18శాతం జననాలు సిజేరియన్ ద్వారానే నమోదవుతున్నట్లు తేలింది. తెలంగాణ (57.7%), ఆంధ్రప్రదేశ్ (40.1%), కేరళ (35.8%), తమిళనాడు (34.1%) రాష్ట్రాలు అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ముందున్నాయి.
*బ్రిటన్‌లో నార్మల్ డెలివరీల వృద్ధి…
ఆసక్తికరమైన విషయం ఏంటంటే..
ఎన్నో అధునాతనమైన ఆరోగ్య సదుపాయాలున్నప్పటికీ బ్రిటన్‌తో సహ అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో, భారత్‌తో పోలిస్తే సిజేరియన్ల సంఖ్య చాలా తక్కువ.2015లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఇంగ్లండ్‌లో 11%, ఇటలీలో 25%, నార్వేలో కేవలం 6.6% సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నాయి.”ఎమర్జన్సీ అయితే తప్ప మేము సిజేరియన్ ఆపరేషన్ల జోలికి వెళ్లము. ఇక ఏ మాత్రం నార్మల్ డెలివరీ సాధ్యం కాదని తెలిశాక, తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందనుకుంటే తప్ప సిజేరియన్ చేయము” అని బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్‌వైవ్స్ అడ్వైజర్ గేల్ జాన్సన్ అన్నారు.”సిజేరియన్ చాలా పెద్ద ఆపరేషన్. అత్యవరసమైతే తప్ప డాక్టర్లు సిజేరియన్ చేయరు” అని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ మాల్కామ్ గ్రిఫ్ఫిత్స్ అంటున్నారు.తంలో సిజేరియన్‌కు సంబంధించిన నిర్ణయం డాకర్లు మాత్రమే తీసుకునేవారు. ఎవరైనా మహిళ సిజేరియన్ కావాలని అడిగినా, డాక్టర్లు ఒప్పుకునేవారు కాదు. కానీ 2011లో ఈ నియమాన్ని సడలించారు. ఎవరైనా సిజేరియన్ చేయమని అడిగితే డాక్టర్ ఒప్పుకోవాలి. కానీ, సిజేరియన్ కోరిన మహిళలకు దాంట్లో ఉన్న కష్టనష్టాలు పూర్తిగా వివరించాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది.వీలైతే నార్మల్ డెలివరీకి ఒప్పించగలగాలి. ప్రసవానికి ముందు స్త్రీలకు అనేక రకాల భయాలుంటాయి. దీన్ని “టోకోఫోబియా (Tocophobia)” అంటారు. ఆ భయం వల్ల సిజేరియన్ చేయమని అడగొచ్చు. అలాంటి భయాలు పోగొట్టి పేషెంట్‌ని నార్మల్ డెలివరీకి ఒప్పించడం డాక్టర్ బాధ్యత.
*భారత్‌లో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
“మనదేశంలో, బ్రిటన్‌కన్నా భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆధునిక వైద్య సదుపాయాలు తక్కువైనప్పటికీ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, వేల సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టుకురావడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది’ అంటారు మద్రాస్ మెడికల్ కాలేజ్ గైనకాలజిస్ట్ వినీతా నారాయణన్.”సిజేరియన్ జరిగాక కోలుకోవడానికి టైమ్ పడుతుంది. ఆపరేషన్ అయ్యాక లేచి తిరగడానికి కొంత సమయం కావాలి. దీనివల్ల ప్రైవేట్ ఆస్పత్రులు లాభపడతాయి. ఖరీదైన సిజేరియన్‌కు తోడు పేషెంట్ ఎక్కువకాలం అక్కడే ఉంటే గది, భోజనం లాంటి వాటికి కూడా డబ్బులు కట్టాలి”ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం.. ప్రసవ సమయంలో నర్సుల ప్రాధాన్యత. “ప్రసవ సమయంలోనూ, ఆ తరవాత కూడా తల్లీబిడ్డల ఆరోగ్యం విషయంలో నర్సుల పాత్ర చాలా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న సిజేరియన్ల వల్ల నర్సులకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి” అని డా. వినీత అభిప్రాయపడ్డారు.‘మహిళల కడుపును కోయడం ద్వారా లాభపడుతున్నది ఎవరు?’… అనే సుబర్ణా ఘోష్ ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు.
3.ఏం కొంటున్నారో దాని గురించి చదవండి.
మీరు సూపర్ మార్కెట్లనుండి ప్రాసెస్ చేసిన ఫుడ్ ప్యాకెట్లను తీసుకెళ్ళేముందు ఏం తీసుకెళ్తున్నారో దానిగురించి తెలుసుకోండి. అందులో మీ బెడ్ రూమ్ ఆనందాన్ని తగ్గించే వస్తువులు వుండవచ్చు.
ఆల్కహాల్ బెట్లకి ఇక దూరంగా ఉండండి ; ఒకటి లేదా రెండు డ్రింక్స్ అంటే సరే, కానీ పూర్తిగా తాగిపడిపోవటం చాలా చెత్త ఆలోచన. ఆల్కహాల్ మీ మెదడుకి చేరాక చాలా జరగవచ్చు, కానీ మంచిగా అన్నీ జరగాలంటే మాత్రం ఈ అలవాటును తగ్గించటం తప్పనిసరి.
3.తీపి స్నాక్స్, డ్రింక్స్ ; వాటిని మీకు దూరంగా, మీ చుట్టుపక్కల వారికి దూరంగా ఉంచండి. అవి స్లోగా పనిచేసే విషాలు. అవి మెల్లగా మీ శరీరమంతా వ్యాపించి,మెల్లగా మీ ఇన్సులిన్ బ్యాలెన్స్ ను నాశనం చేస్తుంది, ఒక్కమాటలో చెప్పాలంటే మీకు ఇష్టమైన వారిని కూడా దూరం చేస్తుంది.
4.ఆకుకూరలు ; వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, చక్కెరపదార్థాలలో ఇది అస్సలు ఉండదు. మీ సగం ఆహారంలో ఇవే ఉండాలి ఎందుకంటే ఇవే రక్తంలో చక్కెరస్థాయిని సరిగ్గా నిలిపి వుంచుతాయి. వాటిల్లో అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. అందుకని ఏం తింటున్నారో ధ్యాస పెట్టండి. ఆహారం మీరు అనుకునేదానికన్నా అనేక మార్గాల్లో మీ పై ప్రభావం చూపించవచ్చు. నేరుగా మీ సెక్స్ జీవితంపై కూడా. నిజానికి అలా అన్నీ పాడుచేసుకోవటం అవసరమా?

3. వారానికో గంట యోగ.. ఇక ఉండదు కుంగుబాటు చింత
వారానికి ఓ గంట పాటు యోగా చేసినా కుంగుబాటును జయించొచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు.వారానికో గంట పాటు యోగ చేస్తే.. మానసిక కుంగుబాటు నుంచి సులువుగా బయటపడొచ్చని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని ఎంపిక చేసుకుని మూడు నెలల పాటు అధ్యయనం చేశారు.వారిని రెండు గ్రూపులుగా విభజించి.. మొదటి గ్రూపులోని వారిని వారానికి మూడుసార్లు, రెండో గ్రూపు వారితో వారానికి రెండుసార్లు చొప్పున మూడు నెలల పాటు యోగా చేయించారు. అయితే యోగా మొదటిపెట్టిన తొలిరోజు.. చివరిరోజు వారి మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్ చేశారు.ఈ అధ్యయనంలో వారిలోని మానసిక కుంగుబాటు లక్షణాలు పూర్తిగా తగ్గాయని, వారానికి గంటపాటు యోగా చేయడం వల్ల మెదడులోని నాడీ వ్యవస్థలో సందేశాల బదిలీలో కీలకంగా పనిచేసే ‘గమ్మా అమినో బ్యూటైరిక్ యాసిడ్ ’(గాబా) మోతాదు పెరగడాన్ని గుర్తించారు. అయితే ఆ యోగా సెషన్ ముగిసి నాలుగు రోజుల తర్వాత గాబా స్థాయి బాగానే ఉంది. కానీ ఎనిమిది రోజుల తర్వాత నాడీ కణాల్లోని గాబా స్థాయి పెరగలేదని వారు గుర్తించారు.కుంగుబాటు నుంచి బయటపడాలంటే.. వారానికోసారి తప్పనిసరిగా యోగా చేయాలని వారు సూచించారు. ఈ అధ్యయనంలో యోగా వల్ల కుంగుబాటు లక్షణాలు తగ్గుతున్నాయనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించామని, అందువల్ల ఇతరులు సైతం తమ ఆరోగ్య సంరక్షణకు యోగాను ఆచరించే అవకాశం ఉందని తెలిపారు.వాస్తవానికి యోగా అనేది పూరాతమైన చికిత్స ప్రక్రియ. కానీ కాలక్రమేణా యోగాను విస్మరించడం వల్ల అది మరుగునపడిపోయింది. ఇటీవల కాలంలో యోగాను ప్రాముఖ్యత పెరగడం.. ప్రపంచ దేశాలు సైత ఆచరిస్తుండడంతో తిరిగి యోగాకు పునర్వైభవం వస్తుంది. అయితే ఇంకా చాలామంది యోగాను కేవలం శరీర అందానికి పనికొచ్చే విషయంగానే చూస్తున్నారు. కానీ ఇది నిజానికి శరీర అందంతో పాటు మనస్సును అదుపులో ఉంచుతుంది.సాధారణంగా కొన్ని వ్యాధులకు మానసిక వ్యథ కారణమే. అయితే మానసిక వ్యథ అనేదాన్ని నయం చేసేందుకు మెడిసిన్ కంటే యోగా ప్రక్రియ అత్యుత్తమం. నిత్యం యోగాను ఆచరించడం వల్ల మనస్సు, శరీరం రెండూ అదుపులో ఉంటాయి. ఫలితంగా అనేక వ్యాధుల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ విషయాన్నిఇటీవల కొంతమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం నిరూపించడం గమనార్హం.

4. వెన్నునొప్పిని తగ్గించే ఎఫెక్టివ్ చిట్కా…
ఇంట్లోని చాలా ఆహారపదార్థాలే ఎన్నో సమస్యలకు మందుగా పనిచేస్తాయి. వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోకుండా మిగతావాటిని ఆశ్రయిస్తాం. ఇప్పుడు డయాబెటీస్, వెన్నునొప్పి, చిగుళ్ల సమస్యలు, పంటి నొప్పులు ఇలాంటి సమస్యలకి ఇంట్లో లభించే పదార్థాలే ఎలా పనిచేస్తాయో చూద్దాం..
*డయాబెటీస్ మందుగా సోయాబీన్..
డయాబెటీస్‌ని కంట్రోల్ చేయడానికి సోయాబీన్ పాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా తేలిగ్గా జీర్ణమవుతుంది. దీనిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
*వెన్నునొప్పికి మందుగా ఆముదం..
నేటి కాలంలో చాలా మంది ఆఫీసుల్లో గంటలు గంటలు కూర్చొని పనులు చేస్తుంటారు. అలాంటివారు ఎక్కువగా వెన్నునొప్పి, మెడనొప్పుల వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం నువ్వుల నూనె, ఆముదం నూనెలు బాగా పనిచేస్తాయి. సమస్య తగ్గాలంటే నువ్వుల నూనె, ఆముదంలో వెల్లుల్లి రేకులు వేసి ఐదు నిమిషాల పాలు సన్నని మంటపై మరిగించండి. ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతాలో రాస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల సమస్య సులభంగా తగ్గుతుంది.
*చిగుళ్ల సమస్యలకు ..
కొంతమంది నోటికి సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు వేప నూనెనివాడడం వల్ల సమస్య తగ్గుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో టీ స్పూన్ వేప నూనె కలిపి ఆ నీటితో నోటిని బాగా పుక్కిలించండి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, మౌత్ అల్సర్, చిగుళ్ల నొప్పుల వంటివి పూర్తిగా తగ్గుతాయి. దీంతో పాటు తాజా వేపాకులు ఉదయాన్నే నములుతూ ఉండండి ఇలా చేస్తుంటే ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయి.
*పంటి నొప్పిగా ఉన్నప్పుడు..
చాలా మంది పంటి నొప్పులతో బాధపడుతుంటారు.. అలాంటాప్పుడు లవంగ నూనె బాగా పనిచేస్తుంది. సమస్య ఉన్న ప్రాంతంలో రెగ్యులర్‌గా లవంగ నూనె రాయండి. ఇలా చేస్తుంటే నొప్పి నుంచి చాలా వరకూ ఉపశమనం ఉంటుంది.
*నులిపురుగల సమస్యకి..
కొంతమందికి నులిపురుగుల సమస్య ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ సమస్యలకు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు టీ స్పూన్ వాము, అంతే పరిమాణంలో ఆముదం కలిపి తీసుకోండి.. అయితే, చిన్నపిల్లలకి చాలా తక్కువ పరిమాణంలో ఇవ్వాలి. ఇలా చేస్తుంటే సమస్య త్వరగా తగ్గుతుంది.

5. మొటిమలు, మచ్చలని పోగొట్టి మెరిపించే ఫేస్ ప్యాక్స్..
ఫేస్ ప్యాక్స్ అనగానే చాలా మంది బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లాలి అని అనుకుంటారు. కానీ, అలా కాకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రై చేయొచ్చు. ఇందులో ఉపయోగించే అన్ని పదార్థాలు కూడా ఇంట్లోనే దొరికేవే కాబట్టి.. ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. పైగా వీటిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
*మొటిమలు, మచ్చలని మాయం చేసే ప్యాక్స్..
చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. అదేంటంటే.. తెల్లగా ఉంటే చాలు అందంగా కనిపిస్తారని.. కానీ, అది ఎంత మాత్రం కానే కాదు.. ఏ రంగులో ఉన్నా.. ముఖం తాజాగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే, ఇది బానే ఉంటుంది కానీ, చాలా మందికి అనేక కారణాలతో మొటిమలు, మచ్చల సమస్యలు ఎదురవుతాయి. ఎన్ని క్రీమ్స్ రాసినా అంతగా ఫలితం ఉండదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి. అలా కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు సమస్యని దూరం చేసుకుని అందంగా మారొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
*పెరుగుతో అందంగా..
పెరుగులో చర్మానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి. దీని వాడడం వల్ల చర్మ కాంతి మెరుగవ్వడమే కాకుండా.. మొటిమలు, మచ్చలు ఇలా చాలా వరకూ అన్ని సమస్యలు దూరం అవుతాయి. అయితే, దీంతో ఎలా ప్యాక్ వేసుకోవాలంటే.. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి.. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోండి. అనంతరం ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే ముఖం మెరుస్తుంటుంది.
*శనగపిండితో..
శనగపిండితో కాంతి మీ సొంతం అవుతుంది. కాబట్టి, శనగపిండి ప్యాక్‌ని కూడా ట్రై చేయొచ్చు. ఇందుకోసం శనగపిండి, రోజ్‌వాటర్, తేనె కలపి ప్యాక్‌లా చేసుకోండి. దీనిని ముఖానికి ప్యాక్‌‌లా వేసుకోండి.. 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఆరుతుంది. అప్పుడు నీటిని చల్లి స్క్రబ్‌లా చేస్తూ ముఖాన్ని కడగండి. ఇలా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోయి ముఖం తాజాగా మారుతుంది. కాబట్టి ఈ ప్యాక్‌ని ట్రై చేయొచ్చు.
*టమాటాతో..
టమాటలో కూడా చర్మకాంతిని మెరుగుపరిచే ఎన్నో గుణాలు ఉంటాయి. కాబట్టి, దీంతో కూడా ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం టమాట గుజ్జుని తీసుకుని అందులో ముల్తానీ మట్టి వేసుకుని ప్యాక్‌లా తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గి అందంగా కనిపిస్తారు.
*తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అయితే, ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం కాదు.. ప్యాక్స్ వేసుకునే ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా… ఏ ప్యాక్ వేసుకునే ముందు అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే ప్యాక్స్ వేసుకోవాలి. అంతేకానీ, దుమ్ము, ధూళి ఉన్న ముఖంపై కాదు.. అప్పుడే అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి. దీంతో పాటు.. ప్యాక్స్ క్లీన్ చేసుకున్న తర్వాత కచ్చితంగా ఏదైనా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ విషయం మరిచిపోవద్దు. లేకపోతే ముఖం అప్పుడే ముఖానికి తేమ అందుతుంది. కాబట్టి కచ్చితంగా ముఖానికి ప్యాక్ రాసిన ప్రతిసారి కచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి

6. ఆమె మనసు అర్థం చేసుకుంటున్నారా..
తల్లి, చెల్లి, ఆలి ఇలా అనేక బాధ్యతలను నిర్వహిస్తున్న స్త్రీలు.. వారి అనుకున్న జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారా.. ఎలాంటి కష్టాలు లేకుండా జీవనగమ్యాన్ని చేరుతున్నారా.. అసలు సమాజంలో ఏం జరుగుతుందంటే..
పుట్టినప్పటి నుంచి..
పుట్టింది మొదలు.. అమ్మ, నాన్న మాటలు వినాలి. బయటికి వెళ్లాలంటే ఎవరైనా తోడు ఉండాలి. గట్టిగా నవ్వకూడదు.. ఎందుకంటే నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని అంటారు కాబట్టి.. ఈడొచ్చిందంటే పెళ్లి కోసం పక్కవారింటి మొదలు ప్రతీ ఒక్కరూ ఆరాటమే.. ఈ జీవిత పరీక్షలు ఉండగానే.. ఆమె విద్య పరీక్షలు కూడా ఉంటాయి. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండానే వాటిని అధిగమిస్తుంది. అయినా.. అవేం పట్టవుగా అందరికీ.. చదువు ఎందుకు పనికొస్తుంది. ఎవరో ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుందనే మాటలు… వీటిని పట్టించుకోని పెద్దవారి కొంతమందైతే.. మరికొంతమంది అవే వేదమంత్రాల్లా గోచరించి వివాహ కార్యక్రమాలు మొదలుపెడతారు.
వివాహం అనంతరం..
వివాహం జరిగాక ఇక కథ మొదలు.. పుట్టినింట్లో ఉండే ఆ కాస్తా కూడా ఉండదు.. అత్తింటి వారు కూర్చొమంటే కూర్చోవాలి.. లేవమంటే లేవాలి.. బాధనిపిస్తే భరించాలి.. సంతోష క్షణాలు తక్కువే.. అయితే, ఇలాంటి క్షణాల్లో మరొకరికి జన్మ ఇవ్వడం.. వారి ఆలనా పాలనా, అత్త, మామ, మరుదులు, ఆడపడుచులు, భర్త ఇలా మొత్తం అదే లోకం..
కనుమరుగవుతున్న జీవనం..
ఇలాంటి సమస్యలతో పోరాడి ఒంటరి జీవనాన్ని ఎంచుకున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఇలాంటి జీవనంలో కాసింత ప్రశాంతత దొరికినా.. వారిని కొన్ని మృగాళ్లాంటి జీవాలు వదలడం లేదు. దీంతో.. ఏం చేయాలో తెలియక సతమయ్యే మహిళలు వారి జీవనాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కానీ, అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. మహిళలు ఇలాంటి సమస్యలతో సతమతమవుతుంటే.. వారికి కౌన్సెలింగ్ చాలా అవసరం అని చెబుతున్నారు.
మనుగడ ఎక్కడ..
మరి ఇన్నింటి నడుమ ఆమె మనుగడ ఎక్కడ ఉంది.. ఇవి కేవలం ఆమెకేంటి.. చక్కని భర్త, పిల్లలు అనుకునే ఆడవారి జీవితాలే.. ఆ ఆకృత్యాలను భరించలేక బయటికొచ్చిన వారు, వరకట్నపు మంటల్లో దగ్ధమయ్యే అబలలు చాలా మందే ఉన్నారు.. వారి జీవితాలు ఏంటి.. ఒక్కో క్షణం కొంతమంది మహిళలు.. ఇలాంటి జీవనం కొనసాగించే బదులు.. ఒక్క క్షణం మృత్యుఒడిని కౌగిలించుకుంటే బావుంటుందని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
స్వచ్చంధ సంస్థలు..
అవును.. చాలా మంది మహిళలు ఈ మధ్యకాలంలో మృత్యు ఒడికి చేరుకుంటున్నారని, ఇందులో దాదాపు వివాహ సమస్యలు కారణం అయితే, మరి కొన్ని ఇతరత్రా సమస్యలు అని చెబుతున్నారు. ఇలాంటి చెరశాల సమామనమైన జీవితం నుంచి ఆమెకి ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందోనని బిక్కు బిక్కు ఎదురుచూసేవారు ఎక్కువైపోయారు. మరి అలాంటి వారు ఇప్పటికైనా మేల్కొని తమ జీవన గమనం ఎటో నిర్ణయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారికి పరిష్కారం చూపేందుకు ఎన్నో స్వచ్చంధ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి..

7.తాజా పండ్లు, కూరగాయలతో కాన్సర్ తగ్గుతుందా..
కాన్సర్‌పై అవగాహన పెంచేందుకు ఏటా ఫిబ్రవరి 4న వరల్డ్‌ క్యాన్సర్‌ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున కాన్సర్‌ పై అవగాహన పెంచే పలు కార్యక్రమాలను వివిధ సంస్థలు నిర్వహిస్తుంటాయి. ఈ కార్యక్రమంలో భాగాంగా కాన్సర్‌ లక్షణాలు, దాన్ని నిరోధించడం, సకాలంలో గుర్తించడం, సరైన చికిత్స చేసుకో వడం వంటి అంశాలపై పలు అవగాహన కార్యక్ర మాలను నిర్వహిస్తుంటారు. అయితే ఎటువంటి ఆహారాన్ని తీసుకంటే కాన్సర్ బారిన పడకుండా ఉంటామో ఇప్పుడు చూద్దాం.
ఎన్నో విధాల కాన్సర్లు..
ప్రపంచంలో ఖరీదైన వ్యాధుల్లో కాన్సర్ కూడా ఒకటి. అయితే క్యాన్సర్ కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, చాలా వ్యాధులు. కాన్సర్ లో 100 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉన్నాయి. చాలా క్యాన్సర్లు ఎక్కడ ప్రారంభమవుతాయో వాటికి ఆ పేరు పెట్టారు. క్యాన్సర్ మీ శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ నుండి ప్రారంభమవుతుంది. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. పాత కణాలు చనిపోయి కొత్త కణాలను ఏర్పరుస్తుంది. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను ‘కణతి'(ట్యూమర్) అని అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కాన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధికి ఇంకా ఖచ్చితమైన చికిత్స లేనందున లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. IARC GLOBALCAN(2012) నుండి వచ్చిన డేటా ప్రకారం భారత దేశంలో సగటు పౌరుడు కాన్సర్ బారిన పడే అవకాశం 10. 1 శాతం ఉందని తెలిపింది. అయితే కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, ఒక వ్యక్తి రోజుకు 10 భాగాలకు పైగా ఆకుకూరలు మరియు పండ్లను తినాలని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో సూచుస్తొంది.
పండ్లు, కూరగాయలు తీసుకోవడంపై పరిశోధన
లండన్‌ లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం కోసం పండ్లు, కూరగాయల తీసుకోవడంపై 95 అధ్యయనాలను విశ్లేషించారు. రోజుకు 800 గ్రాములు కూరగాయలు, పండ్లు తినడం వల్ల గొప్ప ప్రయోజనం లభించినప్పటికీ, రోజుకు ఐదు భాగాల పండ్లు మరియు కూరగాయలు కూడా వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడాన్ని వారు కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జనాభాలో అన్ని పరిశోధనల యొక్క విశ్లేషణ. ఇందులో 2 మిలియన్ల మంది ఉన్నారు మరియు 43,000 గుండె జబ్బులు, 47,000 స్ట్రోక్ కేసులు, 81,000 హృదయ సంబంధ వ్యాధులు, 112,000 క్యాన్సర్ కేసులు మరియు 94,000 మంది మరణించారు.
తాజా పండ్లు, కూరగాయలతో తగ్గే కాన్సర్..
సాధారణంగా రోజుకు 10 భాగాలు, లేదా 800 గ్రా, పండ్లు మరియు కూరగాయలు తింటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 7.8 మిలియన్ల అకాల మరణాలు ప్రతి సంవత్సరం నివారించవచ్చని ఈ బృందం అంచనా వేసింది. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించబడింది. ఏ రకమైన పండ్లు మరియు కూరగాయలు వ్యాధికి వ్యతిరేకంగా గొప్ప రక్షణను అందిస్తాయో పరిశోధకులు విశ్లేషించినప్పుడు, 5 భాగాలు తినడం కూడా సహాయకారిగా ఉందని వారు కనుగొన్నారు, అయితే పది లేదా అంతకంటే ఎక్కువ భాగాలు పండ్లు మరియు కూరగాయలను తిన్న వారు గొప్ప ఫలితాలను సాధించారని వివరించారు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ప్రధాన అధ్యయన రచయిత డాక్టర్ డాగ్ఫిన్ ఆన్ కాన్సర్ వ్యాధి నివారణ కోసం వివరిస్తూ.. “వ్యాధి నుండి రక్షణ, అకాల మరణించకుండా ఉండటానికి ఎన్ని పండ్లు, కూరగాయలు తినాలి అని మేము పరిశోధించినప్పుడు ఐదు భాగాలు పండ్లు మరియు కూరగాయలు మంచివి అయినప్పటికీ, రోజుకు పది భాగాల పండ్లు మరియు కూరగాయలు మెరుగైన ఫలితాలు ఇస్తాయని తెలిపారు.
ఏయే కూరగాయలు కాన్సర్‌ని అడ్డుకుంటాయి..
రోజుకి 200 గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని , అవి 16 శాతం గుండె జబ్బులు, 18 శాతం స్ట్రోక్ ప్రమాదాన్ని మరియు 13 శాతం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఫలితాలు సూచించాయి. ఈ మొత్తం, రెండున్నర భాగాలకు సమానం, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని 4 శాతం మరియు అకాల మరణ ప్రమాదాన్ని 15 శాతం తగ్గిస్తాయి. పండ్లు మరియు కూరగాయలు గుండె జబ్బులు, స్ట్రోక్, హృదయ సంబంధ వ్యాధులు మరియు ప్రారంభ మరణాలు నివారించడంలో సహాయపడతాయి. అవి ఆపిల్, బేరి, సిట్రస్ పండ్లు, సలాడ్లు మరియు పాలకూర, ఆకుకూరలు మరియు బ్రోకలీ, క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలు.
కచ్చితంగా కూరగాయలు పండ్లు తీసుకోవాలి..
కాబట్టి క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల నివారించడానికి కాయగూరలు, మరియు పండ్లు ఎంతో సహాయపడతాయి. అందుకే రోజుకి 5 కంటే ఎక్కువ భాగాల పండ్లు కూరగాయలు ఆరోగ్యానికి ఏంటో మంచివి. ఇవి కాన్సర్ మరియు ఇతర ప్రాణాంతక వ్యాధులు రాకుండా తోడ్పడతాయి.
అందం
మొటిమలు, మచ్చలని పోగొట్టి మెరిపించే ఫేస్ ప్యాక్స్..
ఫేస్ ప్యాక్స్ అనగానే చాలా మంది బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లాలి అని అనుకుంటారు. కానీ, అలా కాకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రై చేయొచ్చు. ఇందులో ఉపయోగించే అన్ని పదార్థాలు కూడా ఇంట్లోనే దొరికేవే కాబట్టి.. ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. పైగా వీటిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
మొటిమలు, మచ్చలని మాయం చేసే ప్యాక్స్..
చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. అదేంటంటే.. తెల్లగా ఉంటే చాలు అందంగా కనిపిస్తారని.. కానీ, అది ఎంత మాత్రం కానే కాదు.. ఏ రంగులో ఉన్నా.. ముఖం తాజాగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే, ఇది బానే ఉంటుంది కానీ, చాలా మందికి అనేక కారణాలతో మొటిమలు, మచ్చల సమస్యలు ఎదురవుతాయి. ఎన్ని క్రీమ్స్ రాసినా అంతగా ఫలితం ఉండదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి. అలా కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు సమస్యని దూరం చేసుకుని అందంగా మారొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
పెరుగుతో అందంగా..
పెరుగులో చర్మానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి. దీని వాడడం వల్ల చర్మ కాంతి మెరుగవ్వడమే కాకుండా.. మొటిమలు, మచ్చలు ఇలా చాలా వరకూ అన్ని సమస్యలు దూరం అవుతాయి. అయితే, దీంతో ఎలా ప్యాక్ వేసుకోవాలంటే.. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి.. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోండి. అనంతరం ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే ముఖం మెరుస్తుంటుంది.
శనగపిండితో..
శనగపిండితో కాంతి మీ సొంతం అవుతుంది. కాబట్టి, శనగపిండి ప్యాక్‌ని కూడా ట్రై చేయొచ్చు. ఇందుకోసం శనగపిండి, రోజ్‌వాటర్, తేనె కలపి ప్యాక్‌లా చేసుకోండి. దీనిని ముఖానికి ప్యాక్‌‌లా వేసుకోండి.. 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఆరుతుంది. అప్పుడు నీటిని చల్లి స్క్రబ్‌లా చేస్తూ ముఖాన్ని కడగండి. ఇలా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోయి ముఖం తాజాగా మారుతుంది. కాబట్టి ఈ ప్యాక్‌ని ట్రై చేయొచ్చు.
టమాటాతో..
టమాటలో కూడా చర్మకాంతిని మెరుగుపరిచే ఎన్నో గుణాలు ఉంటాయి. కాబట్టి, దీంతో కూడా ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం టమాట గుజ్జుని తీసుకుని అందులో ముల్తానీ మట్టి వేసుకుని ప్యాక్‌లా తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గి అందంగా కనిపిస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అయితే, ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం కాదు.. ప్యాక్స్ వేసుకునే ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా… ఏ ప్యాక్ వేసుకునే ముందు అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే ప్యాక్స్ వేసుకోవాలి. అంతేకానీ, దుమ్ము, ధూళి ఉన్న ముఖంపై కాదు.. అప్పుడే అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి. దీంతో పాటు.. ప్యాక్స్ క్లీన్ చేసుకున్న తర్వాత కచ్చితంగా ఏదైనా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ విషయం మరిచిపోవద్దు. లేకపోతే ముఖం అప్పుడే ముఖానికి తేమ అందుతుంది. కాబట్టి కచ్చితంగా ముఖానికి ప్యాక్ రాసిన ప్రతిసారి కచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి

8. చిన్నపిల్లలకి నాన్‌వెజ్ ఏ వయసు నుంచి తినిపించొచ్చు..
మొదటిసారి పిల్లలకి భోజనం తినిపించడం మొదలు పెట్టినప్పట్నుంచి ప్రతి తల్లి మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఏ విధమైన ఆహారం పిల్లలకి పెట్టాలి. ఏ ఆహారం పిల్లలకి మంచిది. అసలు వారికి సరిపడే ఫుడ్ ఏంటి ఇలాంటి ఎన్నో డౌట్స్ ప్రతి మహిళ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా.. పిల్లలకి నాన్‌వెజ్ పెట్టొచ్చా.. పెడితే ఏ వయసులో పెట్టాలి. ఎప్పడు పెడితే వారు ఆ ఆహారాన్ని అరిగించుకోగలరు. ఇలాంటి సందేహాలన్నీ ప్రతి తల్లిని వెంటాడే ప్రశ్నలే. అలాంటి ప్రశ్నలకు నిపుణులు ఏం సమాధానాలు చెబుతున్నారో చూద్దాం..పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టొచ్చు..
ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం పెట్టాలి. అయితే, వారు ఎక్కువ మొత్తంలో ఆహారంలో తీసుకోలేరు. కొద్ది పరిమాణంలోనే వారికి ఆహారం పెడుతూ పోషకాలన్నీ సరిగ్గా అందేలా చూసుకోవాలి. ఇందుకోసం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు అన్నం పెట్టొచ్చు. అయితే, ఆ అన్నం గట్టిగా ఉండకూడదు. మెత్తగా ఉండాలి. అప్పుడే పిల్లలకి జీర్ణ సమస్యలు రావు. అందుకే వారికి పెట్టే అన్నం మెత్తగా ఉడికించాలి. అందులో పప్పు, నెయ్యి, ఉడికించిన కూరగాయలు తప్పనిసరి ఉండాలి. అప్పుడే వారికి సంపూర్ణ పోషకాహారం అందించిన వారవుతాం. అయితే, ఆ కూరగాయలు, పండ్లు కూడా లోపలి భాగానే పెట్టాలి మొదటి కొన్ని రోజులు. ఎందుకంటే, అప్పుడే వారి అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ముందుగానే వారికి పెట్టకూడదు.
గుడ్డు ఏ వయసులో పెట్టొచ్చు..
పిల్లలకు 6 నెలల నుంచి ఉడికిన గుడ్డు పెట్టొచ్చు. అయితే, అది కూడా తెల్లసొన మాత్రమే పెట్టాలి. పచ్చ సొన త్వరగా పిల్లకు అరగదు. కాబట్టి కొన్ని రోజుల వరకూ అది పెట్టకపోవడమే మంచిది.
మాంసాహారం..
మిగతా ఆహారంతో పోల్చితే మాంసాహారంలో కేలరీలు, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారం అంత త్వరగా పెట్టడం మంచిది కాదు. ఏడాదిన్నర నుంచి పిల్లలకి మాంసాహారం పెట్టొచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అదే విధంగా.. పిల్లలకి ఆహారం పెట్టే విషయంలో ప్రతి తల్లి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..ఆహారం పెట్టే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు హడావిడిగా పెట్టకూడదు. ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతూ పెట్టాలి.అదే విధంగా.. వారికి కాచి చల్లార్చిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగించాలి.వారికి పొలమారితే కొద్దిగా నీటిని తాగించొచ్చు. ఆ నీరు కూడా కాచి చల్లార్చినదే అయి ఉండాలి.దీంతో పాటు పిల్లలకు వాడే గిన్నెలు, చెంచాలు రోజూ వేడినీటిలో మరిగించాలి. అదే విధంగా, ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకూడదు. కొద్దిగా కొద్దిగా పెడుతుండాలి.ఇలా పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కచ్చితంగా శుభ్రంగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా మంది తల్లలు పిల్లలకి ఉగ్గు ఒకేసారి కలిపి పెట్టి సాయంత్రం కూడా అదే తినిపిస్తారు. ఇది ఎంతవరకు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. దీంతో వారికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు వారికి ఆహారం చేసి పెట్టడం మంచిది. అప్పుడే వారు కూడా తృప్తిగా తింటారు. ఈ విషయంలో ప్రతి తల్లి కూడా కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి.