DailyDose

మలాలాను కాల్చిన ఉగ్రవాది జైలు నుంచి పరారి-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Terrorist who shot malala escapes from prison

* అమెరికా మరో కీలక ఉగ్రవాద నేతను హతమార్చింది. అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్‌ఖైదా నాయకుడు ఖాసీం అల్‌-రైమీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలో నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అంగీకరించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.‘‘యెమెన్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అరేబియన్‌ పెనిన్సులాలో అల్‌ఖైదా(ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసీం అల్‌-రైమీని హతమార్చాం. రైమీ నేతృత్వంలో సామాన్య పౌరులపై ఏక్యూఏపీ వికృత హింసాకాండకు పాల్పడ్డది. అతడి మృతితో అల్‌ఖైదా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నాం’’ అని శ్వేతసౌధం విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్‌ వెల్లడించారు. అయితే అతణ్ని ఎప్పుడు మట్టుబెట్టింది మాత్రం తెలపలేదు
* జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ ఒమర్ అబ్దుల్లాపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. వీరితో పాటు నేషనల్ కన్ఫరేస్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన కీలక నేతల పైన కూడా కేసులు దాఖలు వేసినట్లు తెలుస్తోంది.
* కోడూరు మండలం పాదాల వారి పాలెం గ్రామం లో మానసిక ఒత్తిడికి గురై సహచరని లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తాడిచెట్టు ఉరి వేసుకున్న పరిశే కోటేశ్వరరావు.భార్య కొంత కాలం క్రితం చనిపోవడంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న కోటేశ్వరావు (52).ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు వివాహితులే.
* గుంటూరు జిల్లా దాచేపల్లి(మం)శ్రీనగర్ RTA చెక్ పోస్ట్ లో ACB అడిషనల్ యస్పి సురేష్ బాబు ఆద్వర్యంలో దాడులులెక్కకు మించి అధికంగా ఉన్న 23180 రూపాలను స్వాదీనం చేసుకున్న ACB అధికారులు
* అక్కన్నపేట కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరిపిన సదానందానికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడేళ్ల క్రితం హుస్నాబాద్ పీఎస్‌ నుంచి ఏకే 47, 2 కార్బన్‌ గన్లు మాయమయ్యాయి. సదానందం దగ్గర ఉన్న ఏకే 47 అదేనా అని అనుమానిస్తున్నారు. సదానందం కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
* కర్లపాలెం మండలము కర్లపాలెం సేంటర్ లో సరైన పత్రలలేకుండా సుమారు240 బస్తాల రేషన్ బియ్యం లోడుతో వేళ్ళుతున్న లారి ని అదుపులోకి తిసుకోనీ విచరిస్తున్న కర్లపాలెం పోలీసులు .
* గుంటూరు జిల్లాసత్తెనపల్లి పాత బస్ స్టాండ్ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడిముగ్గురి అరెస్ట్..రూ.71310 నగదు స్వాధీనం
పాకిస్తాన్ కు చెందిన నోబెల్ బహుమతి గ్రహిత మలాలా యూసుఫ్ జహినీ షూట్ చేసిన తాలిబాన్ ఉగ్రవాది ఇషానుల్లా ఇషాన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. 2014లో పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై జరిగిన దాడికి కూడా ఈ ఉగ్రవాడే బాధ్యుడు.
* ఢిల్లీ జేఎన్ టీయూ విద్యార్ధినిపై లైంగిక దాడి జరిగింది. లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
* నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్యకేసులో 8వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ఇంతియాజ్‌కు ఇవాళ(గురువారం,ఫిబ్రవరి-6) ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో నెల్లూరులోని హరనాథపురం రెండో వీధిలో నివాసముంటున్న దినకర్ రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవిలను నిందితుడు ఇంతియాజ్ మరో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి హత్య చేశారు.
* రైల్వే బ్రిడ్జీపై ఒంటరిగా వెళుతున్న మహిళలపై ముద్దుల వర్షం కురిపించిన సీరియల్ ఈవ్‌టీజర్ రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ను ముంబై రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయ్‌జూర్ హబీబర్ ఖాన్‌ ముంబై నగరానికి వచ్చి వడ్రంగిగా పనిచేస్తున్నాడు. మాటుంగా రైల్వే వంతెనపై ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి వద్దకు వచ్చి పట్టుకొని, ముద్దాడి పారిపోతుండటం ఈవ్‌టీజర్ రాయ్‌జూర్ కు నిత్యకృత్యంగా మారింది.
* ఆంజనేయస్వామి, సోమేశ్వరస్వామి, సీతారామాంజనేయస్వామి, ముత్యాలమ్మ, కనకదుర్గ ఆలయాల్లోని విగ్రహాలను స్వల్పంగా ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ధ్వంసమైన విగ్రహాలను చూసిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. విగ్రహాల ధ్వంసంపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు, క్లూస్ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ సీఐడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విగ్రహాల ధ్వసం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆరు ఆలయాల్లో 12 విగ్రహాలను కూల్చివేశారు.
* తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని అక్కమహాదేవి గుహల సమీపంలో ఈ నెల 2న హత్యకు గురైన మహారాష్ట్ర మహిళ (52) కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన ఓ సాధువు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లమల అటవీ ప్రాంతంలోని అక్కమహాదేవి గుహలకు చేరుకునే మార్గంలో ఈ నెల 2న ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో దీనిని నరబలిగా అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* తిరుపతి అలిపిరి రోడ్డులోని అరవింద్ ఐ ఆసుపత్రి దగ్గర 70 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం….రెండు వాహనాలతో పాటు ఇద్దరు తమిళ స్మగ్లర్లు ను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్
* తాడిపత్రి పట్టణం పుట్లూరురోడ్ లో టైలర్స్ కాలనీ సమీపంలో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్ద టాటా మోటార్స్ నిర్వాహకుడు తెలుగుదేశం మద్దతుదారులైన హాజీబాషా కారును( APO2 AR 6799) గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు
* హైదరాబాద్‌ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులను హెచ్‌పీ గ్యాస్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
*విదేశాలకు వెళ్లడానికి వీసా, ఇమ్మిగ్రేషన్ ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన కన్సల్టెన్సీ యజమానిని పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోల్కొండకు చెందిన మహ్మద్ ఇలియాస్(50) 2017లో పంజాగుట్ట టోపాజ్ బిల్డింగ్లో బెకాన్ కన్సల్టింగ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. కెనడా, ఆస్ర్టేలియాకు వెళ్లడనికి వీసా, ఇమ్మిగ్రేషన్ ఇప్పిస్తానని ప్రకటనలు ఇచ్చాడు. పలువురు రూ. 50 వేల నుంచి 70 వేల వరకు చెల్లించారు. రోజులు గడుస్తున్నా వీసా ప్రాసెస్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ప్రశాంతి అనే యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి సూచించారు.
*నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్యకేసులో 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు ఇంతియాజ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో నెల్లూరులోని హరనాథపురం రెండో వీధిలో నివాసముంటున్న దినకర్రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవిలను ఇంతియాజ్తో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు పథకం ప్రకారం హత్యచేశారు.
*స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్ను అనుకరించాలని ప్రయత్నించి ఓ విద్యార్థి మరణించాడు. ఉరితీసే సన్నివేశాన్ని ప్రయత్నించి ప్రమాదవశాత్తూ ఆ తాడుకే బలయ్యాడు. ఈ విషాదం మధ్యప్రదేశ్లోని మంద్సౌర్లో చోటుచేసుకుంది. ఇక్కడి అఫ్జల్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న శ్రేయాన్ష్ (12).. ఇటీవల పాఠశాల వార్షికోత్సవ వేడుకలో ఓ నాటికలో నటించాడు. అందులో ఓ బ్రిటీష్ అధికారి పాత్ర పోషించాడు.
*ఒంటరిగా మహిళలు కనిపిస్తే వెనుక నుంచి వెళ్లి హత్తు కుంటాడు. వారిని లైంగికంగా వేధిస్తాడు. వారు ప్రతిఘటించే లోపే అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇలా కొన్ని రోజులుగా సాగుతున్న అతడి దురాగతాలు సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో బట్టబయలయ్యాయి. దీంతో పోలీసులు ఆ ఆకతాయి ఆట కట్టించారు. ఇంత జరిగినా నిందితుడిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
*వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కామునిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఫ్యాన్కు ఉరివేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలకు పాల్పడిన వారిద్దరూ వరుసకు అక్క, తమ్ముడు కావడం గమనార్హం.
*భక్తిభావంతో ఆలయాలను దర్శించుకుంటున్న ఓ మహిళ సాధువు ముసుగులో ఉన్న ఓ కామాంధుడిని నమ్మి దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. నల్లమల అభయారణ్యంలో ఈనెల 2న లభ్యమైన మృతదేహం కేసులో వేగంగా దర్యాప్తు పూర్తిచేసిన నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట పోలీసులు గురువారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
*కడపలోని ద్వారకానగర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి ఇంట్లో గురువారం ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఝార్ఖండ్, మహారాష్ట్రకు చెందిన ఐటీ అధికారులు, వారికి రక్షణగా కేంద్ర పోలీసు బలగాలు వచ్చాయి. సోదాల సమయంలో శ్రీనివాసులరెడ్డి ఇంట్లో లేరు. ఆయన తల్లి, మాజీ మంత్రి రాజగోపాల్రెడ్డి సతీమణి హేమలత ఒక్కరే ఉన్నారు.
*మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో జరిగిన మూక దాడిలో 35ఏళ్ల గణేశ్ పటేల్ మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్కు చెందిన వారు కూలీల నుంచి రావాల్సిన సొమ్ము వసూలు కోసం బరోలికి వెళ్లారు. డబ్బు ఎగ్గొట్టేందుకు.. వీరు పిల్లలను ఎత్తుకు పోయేందుకు వచ్చిన ముఠాగా కూలీలు వదంతులు వ్యాపింపచేశారు. దీంతో గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
*అత్యంత ఉత్కంఠ భరితంగా దిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో… గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక కీలక పరిణామం చోటుచేసుకుంది! ఆప్ అగ్రనేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ) గోపాలకృష్ణ మాధవ్ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంటనే అధికారులు ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. జీఎస్టీకి సంబంధించి రూ.2 లక్షల ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై మాధవ్ను ప్రశ్నిస్తున్నారు.
*రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా ఏదో ఒక బీఈడీ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి అనంతరం వారిని నిండా ముంచుతున్నాయి. సంబంధిత విద్యార్థులు చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించి పరీక్షలు రాయాల్సి వస్తోంది.
*పక్కింటి అతను అసభ్యకరంగా తిట్టాడని.. మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
*బిర్యానీ తీసుకురావాలని మూడు రోజులుగా చెబుతున్నా.. భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతుంది.