DailyDose

రాజన్న వద్దకు హెలికాప్టర్ సేవలు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Helicopter Service To Vemulavada Rajanna

* మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకు హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించిని విషయం తెలిసిందే. తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ సహకారంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ సేవలను ప్రారంభించింది. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెలికాప్టర్‌ సేవలు ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.ఇక హెలికాప్టర్‌ సేవలకు సంబంధించి ధరల విషయంలో మూడు ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. ప్యాకేజీ-1 లో వేములవాల నుంచి వ్యూ పాయింట్‌కు ఏడు నిమిషాల రైడ్‌కు టికెట్‌ ధర రూ. 3 వేలు. ప్యాకేజీ-2 లో వేములవాడ మిడ్‌మానేరు పరిసర ప్రాంతాలను చూసేందుకు రూ. 5,500. కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం. ఇక ప్యాకేజీ – 3 లో హైదరాబాద్‌ నుంచి వేములవాడకు, తిరిగి హైదరాబాద్‌కు. టికెట్‌ ధర రూ. 30 వేలు. కనీసం ఐదుగురు వ్యక్తులుడాలి.
కాగా భవిష్యత్తులో. ప్రధానాలయాలు, పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్‌ సేవలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదే క్రమంలో. మిడ్‌మానేరు నుంచి సిరిసిల్లకు బోటు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వేములవాడకు పర్యాటక ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు…
* రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు 65వ రోజు ఉద్రిక్తంగా మారాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు.
నిన్న కృష్ణాయపాలెంలో ఇళ్ల స్థలాల కోసం భూములు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు 426 మంది రైతులపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ మందడం దీక్షా శిబిరం ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను శుభ్రం చేస్తూ రైతులు నిరసన తెలిపారు. రోడ్డు ఖాళీ చేయాలంటూ అక్కడికి చేరుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎన్ని సార్లు కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మందడం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది.
* ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం ఉదయం ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన 1, 2 సొరంగాలను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్‌, అనిల్‌కుమార్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఇంజినీరింగ్‌ అధికారులు సీఎం పర్యటనలో పాల్గొన్నారు.
* రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు 65వ రోజుకు చేరాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు.
నిన్న కృష్ణాయపాలెంలో ఇళ్ల స్థలాల కోసం భూములు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు 426 మంది రైతులపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ మందడం దీక్షా శిబిరం ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను శుభ్రం చేస్తూ రైతులు నిరసన తెలిపారు. రోడ్డు ఖాళీ చేయాలంటూ అక్కడికి చేరుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎన్ని సార్లు కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మందడం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది.
* పాకిస్తాన్‌లోని గురుద్వారా నిర్వాహక కమిటీ తాజాగా కర్తార్‌పూర్ సాహిబ్‌లో టిక్‌టాక్ వీడియోలతో పాటు ఇతర షూటింగ్‌లు చేయడంపై నిషేధం విధించింది. భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే భక్తులకు ఈ ప్రాంతంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించిన సంగతిని తెలియజేస్తూ గురుద్వారా సాహిబ్ పరసరాల్లో పలు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఈ ప్రకటనను హోర్డింగ్‌లపై రాశారు. ఇక్కడ టిక్ టాక్ వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దానిలో పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు విపరీతంగా టిక్‌టాక్‌లు చేస్తున్న నేపధ్యంలో గురుద్వారా నిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
*సగరుల ఆరాధ్యదైవం భగీరథ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సగర(ఉప్పర) సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు.
*నమామి గంగ తరహాలో తెలంగాణలోని మూసీ నదిని పరిరక్షించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం దిల్లీలో ఆయన వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. మూసీ నది కాలుష్యం, నివారణ చర్యలకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. ఔషధ కంపెనీలు, మురుగు నీటితో మూసీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆయన వివరించారు.
*ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి గజరావ్ భూపాల్ తెలంగాణ క్యాడర్కు మూడేళ్లపాటు డిప్యుటేషన్పై రానున్నారు. వ్యక్తిగత అవసరాల రీత్యా ఆయన అంతర్రాష్ట్ర డిప్యుటేషన్కు కేంద్రం అనుమతించింది.
*బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 21వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో దరఖాస్తుల కాలపట్టికను ఖరారు చేశారు. పీఈసెట్పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు వివరాలతో కూడిన గోడపత్రికను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, కన్వీనర్ ఆచార్య సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు
*అనుమతి తీసుకోకుండా ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడినందుకు ‘సహాయ డివిజనల్ ఇంజినీరు’(ఏడీఈ) కోటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు ఇంజినీర్లపై ఆరోపణలు చేస్తూ మాట్లాడారని తెలిపింది. గతంలో అవినీతికి పాల్పడి ఏసీబీకి పట్టుబడిన కోటేశ్వరరావు ఏసీబీ కేసు తేలకముందే పదోన్నతి ఇవ్వమని ఒత్తిడి తెచ్చారని, ఆయన మాట వినలేదన్న కోపంతో సంస్థపై అవినీతి ఆరోపణలు చేశారన్నారు. ఈ కారణంగానే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు.
*గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద సీసీ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. మెదక్ కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వీటికి సంబంధించి పనులను మార్చి 31లోపు పూర్తి చేయాలని, లేకుంటే నిధులు వెనక్కి వెళతాయన్నారు.
*రాష్ట్రంలో 57,423 ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని కేంద్ర వక్ఫ్ మండలి గుర్తించింది. వీటి పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ప్రభుత్వం స్పందించకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన మండలి సభ్యులు పలు ఆస్తులను పరిశీలించారు.
*కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న సామాజిక ఆసరా పింఛన్లపై తనిఖీ నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ అవుతున్న పింఛన్లలో కేంద్రం వాటా 2 శాతం కూడా లేకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. తనిఖీలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ఏడాదిలో కనీసం రెండు గ్రామ సభలు, రెండు వార్డు సభలను సామాజిక తనిఖీలకు ప్రత్యేకించి.. వాటిలో జాతీయ పింఛనుదారుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని కేంద్రం తెలిపింది.
*ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించలేకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోవచ్చని… ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి సురేష్ సూచించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను శాసించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. బుధవారం విజయవాడలో ఇంటర్ విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం జరిగింది.
*ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులోనూ మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలను చేపడతామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధన దిశగా సాగుతున్న ట్రస్ట్కు మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు పూర్తి సహకారం అందించారన్నారు. బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ 23వ ఆవిర్భావ వేడుకలను బుధవారం నిర్వహించారు.
*రూ.1,400 కోట్లు చెల్లించినట్లు బుధవారం జరిగిన సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అయినా కొత్తగా ప్రారంభించిన పనులు ఎందుకు వేగవంతం కావట్లేదని అధికారులను ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ ‘గతేడాది పనుల్లో అవకతవకలు జరిగాయి. వీటిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అక్రమాలు జరగలేదని తేలితే బిల్లులు చెల్లిస్తున్నాం. గ్రామ సచివాలయాలు, మురుగు కాలువలు, ప్రహరీలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటికి ఇసుక లభ్యతపై మినహాయింపులు ఇచ్చాం. నిర్ణీత గడువులోపు వెయ్యికోట్ల వరకు ఖర్చు చేయాలి’ అని ఆదేశించారు
*సచివాలయ అధికారులు, ఉద్యోగుల జోలికొస్తే ఊరుకునేది లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్నిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారని చెప్పారు. ఛైర్మన్ చెప్పినంత మాత్రాన, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యదర్శి వెళ్లలేరని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శికి మద్దతుగా అవసరమైతే గవర్నర్ను కలుస్తామని, నిబంధనల ప్రకారం నడిచే అధికారులకు మద్దతివ్వాలని, భద్రత కల్పించాలని కోరతామని చెప్పారు
*కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఆ నగరంలో ఆర్టీసీ బస్సులను సుందరంగా మార్చాలని ఆలోచిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ప్రతాప్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన ఆర్టీసీ-ఛలో యాప్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొత్తగా 22 మల్టీ యాక్సిల్ వోల్వో బస్సులు తీసుకుంటామని, వీటిని దూరప్రాంతాల నుంచి విశాఖకు ‘డాల్ఫిన్ క్రూయిజ్’ పేరిట నడుపుతామని చెప్పారు.
*చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.1,931 కోట్ల రుణాన్ని నాబార్డు మంజూరు చేసింది. మౌలిక సౌకర్యాల అభివృద్ధికి సహకారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల అభివృద్ధి సంస్థకు రుణమిస్తున్నట్లు నాబార్డు ప్రాంతీయ సీజీఎం ఎస్.సెల్వరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2022 మార్చినాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాల పరిధిలోని గ్రామాలకు నీటి వసతి కల్పిస్తారు. 4.80లక్షల ఎకరాల ఆయకట్టుకు మూడు దశల్లో 53.50 టీఎంసీల సరఫరా సామర్థ్యంతో నిర్మిస్తున్నారు.
*రాష్ట్రంలో 20 మండల ప్రజాపరిషత్తులను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని గెజిట్లో ప్రచురించాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
*రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.విజయ్ కుమార్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో సమానంగా వేతనం, డీఏ, హెచ్ఆర్ఏ నిర్ణయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నియమించింది. ఆయనకు వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడితో పాటు మరో నలుగురు సిబ్బందిని కేటాయించింది.
*ఆంధ్రప్రదేశ్ జల వనరుల విభాగానికి జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్, పవర్ (సీబీఐపీ) అవార్డు లభించింది. బుధవారమిక్కడ నిర్వహించిన 93వ సీబీఐపీ వార్షికోత్సవాల్లో కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్లాల్ కటారియా చేతుల మీదుగా ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఏపీ ప్రభుత్వం తరఫున అవార్డు అందుకొన్నారు. ఏపీ జలవనరుల సమాచార, నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేసిన వస్సార్ ల్యాబ్స్కు ఉత్తమ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్ అవార్డు దక్కింది.
*జనాభా లెక్కల సేకరణలో భాగంగా రెండుదశల్లో గృహాల జాబితా తయారీ, జనగణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరణ చేస్తామని జనగణన, సిటిజన్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం, గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలాల్లో వివరాల నమోదు పూర్తిచేశామని తెలిపారు.