NRI-NRT

టీమ్ మిన్నెసొటా ఆధ్వర్యంలో తెలుగు భాషా పోటీలు

Minnesota Telugu Competitions 2020 In USA

యూఎస్‌లోని మిన్నెసొటాలో తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మిన్నెసొటా (టీమ్‌) ఎంతో కృషి చేస్తోందని ఆ సంఘం అధ్యక్షుడు రాము తొడుపునూరి అన్నారు. మిన్నెసొటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ మార్చిని తెలుగు భాష, సంస్కృతి వారసత్వ నెలగా ప్రకటించడం ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. మిన్నెసొటాలో తెలుగు భాష, సంస్కృతిని భవిష్యత్‌ తరాలకు చాటి చెప్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి నెలలో తెలుగు సంస్కృతి తెలియజెప్పేవిధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 14న తెలుగు చదవడం, రాయడం, పాటలు పాడటం, కవితలు, ప్రసంగాలు తదితర పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 28న ఉగాది సంబరాలు జరపనున్నట్లు వివరించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ మిన్నెసొటా (ఐఏఎం) అధ్యక్షుడు శ్రీనివాస్‌ చెక పాల్గొని జన గణన- 2020పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. సమావేశంలో టీమ్‌ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పెరకం, ప్రధాన కార్యదర్శి రమేష్‌ ఆకుల, కోశాధికారి రామ్‌ పటేటి, సాంస్కృతిక కార్యదర్శి సంతోష్‌ నందగిరి, మీడియా కార్యదర్శి సుధాకర్‌ యంజాల, వెబ్‌ కార్యదర్శి జ్యోత్స్న తిరుమల, ఈవెంట్‌ సెక్రటరీ దీపక్‌ చింతా, మహేశ్వర్‌ అవిలాల, అరుణ్‌ కుమార్‌ తంగిరాల, సునీల్‌ రాజు, ప్రసాద్‌ గుంటూరి, వెంకట్‌ తోట, బాల తడవర్తి, బాబు గడ్డమడుగు, లక్ష్మీ దండమూడి, మూర్తి ఇవటూరి పాల్గొన్నారు.