Health

మీ పళ్లు కుళ్లిపోవడానికి ఇదే కారణం

This is what causes your tooth to decay-Telugu dental health news

పళ్లకు సంబంధించిన సమస్యల్లో పాచి ఒకటి. అది పళ్ళు పుచ్చి పోవడానికి కారణమవుతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల దీని బారి నుంచి బయటపడొచ్చు. గ్రీన్ టీలో ‘ఎపిగల్లోకాటెజిన్ గాలెట్‌‌‌’ ఉంటుంది. ఇది పన్ను పుచ్చిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో విపరీతంగా పోరాడుతుంది. కొన్నికొన్ని సార్లు మనం తీసుకునే ఫుడ్‌లోని చిన్నచిన్న తునకలు పళ్లలో ఇరుక్కుని, బ్యాక్టీరియాగా మారి దంత క్షయానికి కారణమవుతుంది. ఈ విషయంలోనూ గ్రీన్ టీ సాయపడుతుంది. బాక్టీరియాను తగ్గించడంలో గ్రీన్ టీ మంచి రోల్ పోషిస్తుందన్న విషయం పలు అధ్యయనాల్లో రుజువైంది. నోటికి సంబంధించిన సమస్య గొంతు వెనక భాగానికి కూడా పాకుతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ఆ ప్రదేశాన్ని టూత్ బ్రెష్‌తో కూడా క్లీన్ చేయలేం. దాంతో ఒకసారి అక్కడ బ్యాక్టీరియా చేరాక, దుర్వాసనను దూరం చేయడం కష్టమైన పని. దీనికి కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ ఈ బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో సాయపడుతుంది.
This is what causes your tooth to decay-Telugu dental health news