NRI-NRT

ఏపీ డిజిటల్ కార్పోరేషన్ వైస్-ఛైర్మన్‌గా వాసుదేవరెడ్డి

Chinna Vasudeva Reddy Appointed As Andhra Pradesh Digital Corporation VC MD

రాయలసీమకు చెందిన ప్రముఖ నిర్మాత చిన్నా వాసుదేవరెడ్డిని ఏపీ డిజిటల్ కార్పోరేషన్ వైస్-చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్‌గా నియమిస్తూ జగన్ సర్కార్ జీవో విడుదల చేసింది. ఏపీ కంటెంట్ కార్పోరేషన్‌ను ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌గా పేరు మార్చి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జీవోలో ఉత్తర్వ్యూలను పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వైస్-ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్‌గా చిన్న వాసుదేవరెడ్డి నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వాసుదేవరెడ్డి న్యూయార్క్ లో స్థిరపడ్డారు. ఐ డ్రీమ్ మీడియా సంస్థలు స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులర్ సంస్థగా తీర్చిదిద్దారు. సౌమ్యుడు మంచి స్నేహశీలిగా పేరు గడించిన వాసుదేవరెడ్డి నియామకం పట్ల ఆయన స్నేహితులు ఆత్మీయులు అభినందనలు తెలుపుతున్నారు. గత 15 సంవత్సరాల నుండి నాకు మంచి ఆప్తమిత్రుడుగా ఉన్నా వాసుదేవరెడ్డికి అభినందనలు-TNI మీడియా సంస్థ తరఫున ఆయనకు అభినందనలు —కిలారు ముద్దుకృష్ణ.