Health

జబ్బులు పోతాయి. యవ్వనం వస్తుంది. అదే నిద్ర మహత్తు.

Sleep Well. Kick Diseases. Earn Youthfulness.

సరైన ఆరోగ్యం లేనప్పుడే నిద్ర సమస్యలు వస్తాయి. నిద్రలేమివల్ల గుండెకు సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది.

-కంటినిండా నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కనీసం 6-9 గంటలు నిద్రపోవాలి. -సమయానుసారంగా నిద్రపోతే శరీరంలోని జీవక్రియలో మార్పులు వచ్చి చర్మం కళకళలాడుతుంది.

-ఉదయం లేవడంతోనే వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా నడకతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ క్రమబద్ధంగా సాగుతుంది. బీపీ, డయాబెటీస్ వంటివి కూడా తగ్గుముఖం పడుతాయి.

-మార్నింగ్ వాక్‌తో శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా అందుతుంది. తద్వారా చర్మ కాంతి కూడా పెరుగుతుంది.

-ఆహారాన్ని క్రమం తప్పకుండా తింటున్నాం కదాని పండ్లను తినడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తాజా పండ్లను తినడం ద్వారా శరీరంలో రక్తపుష్టి పెరుగుతుంది. దాంతో పాటు తగినన్ని విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి.

-పనిలో పడి మంచినీటిని తాగడం మర్చిపోతుంటారు చాలామంది. ఇది చాలా ప్రమాదకరం. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు ఎంతో సహకరిస్తుంది.

-ముఖ్యంగా మన శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దు. శరీరానికి తగినంత నీరందకపోతే చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది.