Editorials

పింగూ…బీ రెడీ

Trump sends severe warnings to China president Xi JinPing

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. చైనా ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు తేలితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంలో, ఆ విషయాలను తమతో పంచుకోవడంలో చైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. శనివారం ఆయన తన అధికార నివాసం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘తొలుత చైనాతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పుడైతే కరోనా వైరస్‌ బయటపడిందో అప్పటి నుంచి ఆ దేశంపై కోపం వస్తున్నది. ఒకవేళ చైనా ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు తేలితే ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.