NRI-NRT

ప్రవాస తెలుగు విద్యార్థులకు తానా నిత్యావసర సరుకులు

TANA Helps Telugu Students With Groceries During COVID19

అమెరికాలోని తెలుగు విద్యార్థులకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించటానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 1-855 OUR-TANA పేరిట ఒక టోల్‌ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసి దీనికి ఫోను చేసిన వారికి రెండు వారాలకు సరిపడా సరుకులు అందజేసేందుకు సన్నాహాలు చేసింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు, వసతి కోల్పోయి అమెరికాలో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు సంస్థ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.