NRI-NRT

కోడెలకు కోమటి జయరాం నివాళి

NRI TDP Leader Komati Jayaram Offers Tribute To Kodela

నాకు అత్యంత ఆప్తులు, గురుతుల్యులు, నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నా అశ్రునివాళి. మూడు దశాబ్దాలుగా ఆయనతో నాకున్న అనుబంధం చిరస్మరణీయమైనది. ఆయనతో సన్నిహితంగా గడిపిన కాలం మరచిపోలేనిది. ఆయనకంటే వయసులో చిన్నవాడిని అయినా ఆయనతో స్నేహం, నాపై ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయంగా పలకరించే తీరు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఎంతోమంది నాయకులతో స్నేహమున్నా, ఏమీ ఆశించకుండా ఇంత ఆప్యాయంగా, ఆత్మీయంగా అనుబంధం ఏర్పడింది మాత్రం డాక్టర్ గారితోనే అని చెప్పగలను. గురువుగారూ, కాలిఫోర్నీయా బయల్దేరండి అని ఏర్పాట్లు చేస్తే అలాగే జయరామ్ అని సంతోషంగా వచ్చేవారు. వచ్చిన తర్వాత మన తెలుగువాళ్ళందరినీ కలవాలి అని ప్రతి ఒక్కరితో మాట్లాడి యోగక్షేమాలు అడిగేవారు. ఆయన ఉంటే స్నేహితులతో సందడిగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేసే యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఎంతో ప్రోత్సహించారు. అన్ని సౌకర్యాలతో శ్మశానవాటిలని తీర్చిదిద్దాలనే సంకల్పానికి స్ఫూర్తి ఆయనే. అమెరికా వస్తే రాజకీయచర్చలు కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రులు ఎలా తోడ్పడతారు అనేదానిపైనే ఆయన ఫోకస్ ఎక్కువగా ఉండేది. ఇలాంటి ప్రజానాయకుడ్ని, అభివృద్ధికాముకుడ్ని ఇలా కోల్పోవడం రాష్ట్రానికి, వ్యక్తిగతంగా నాకూ, NRI TDP కి తీరని లోటు. జోహార్ డాక్టర్ కోడెల ? – కోమటి జయరాం