Movies

లిప్‌లాక్‌కు ఆజ్యం పోసిన మలయాళ సినిమా

The first 1933 Malayali movie that introduced liplock

లిప్‌లాక్‌లు నేటి సినిమాల్లో కామన్‌గా మారిపోయాయి. ముద్దు సన్నివేశాలు లేకుండా సినిమాలు రూపొందడం లేదంటే అతిశయోక్తి కాదు. తమ సినిమాల్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారాస్ర్తాలుగా ఈ లిప్‌లాక్‌లు కొందరు దర్శకనిర్మాతలు ఉపయోగించుకుంటున్నారు. అంతలా ప్రస్తుత సినిమాల్లో లిప్‌లాక్‌లకు ప్రాధాన్యత పెరిగింది. అయితే భారతీయ చిత్రసీమలో లిప్‌లాక్‌ ఉన్న మొదటి సినిమా ఏదో తెలుసా. మలయాళ చిత్రం మార్తండవర్మ. 1933లో రూపొందిన ఈ చిత్రంలో ఏవీపీ మీనన్‌, పద్మినిలపై ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇండియన్‌ స్క్రీన్‌పై ఇదే తొలి లిప్‌లాక్‌. 87 ఏళ్ల క్రితం ముద్దు సన్నివేశాల ట్రెండ్‌కు ఈ సినిమా శ్రీకారం పలికింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లోతెరకెక్కిన ఈ మూకీ సినిమాకు పీవీ రావుదర్శకత్వం వహించారు. మలయాళ సాహిత్యం ఆధారంగా తెరకెక్కిన మొదటి సినిమా ఇది. అదే ఏడాది హిందీ చిత్రం కర్మలో నాలుగు నిమిషాల నిడివితో కూడిన ముద్దు సన్నివేశాన్ని నాయకానాయికలు దేవికారాణి, హిమాన్షురాయ్‌లపై చిత్రీకరించారు. ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దేవికారాణి, హిమాన్షురాయ్‌ నిజజీవితంలో భార్యాభర్తలు కావడం గమనార్హం. హిందీ చిత్రసీమలో ఎక్కువ నిడివి కలిగిన లిప్‌లాక్‌గా ఇప్పటికీ కర్మ సినిమా రికార్డు అలాగే ఉంది.