Food

తేనె తప్పక తీసుకోండి

Eat Honey Everyday Without Fail

అన్నప్రాశనలో తేనె… ఇష్టదైవం అభిషేకంలో తేనె.. తేనీరులో తేనె ఇలా మన జీవితంతో పెనవేసుకున్న తేనె రుచిలోనే కాదు.. ఔషధ గుణాల్లోనూ రారాజు…
* ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ సమస్యలున్నవాళ్లు గోరువెచ్చటి నీటిలో కొంచెం తేనె, మిరియాల పొడి వేసి తాగితే జలుబు, దగ్గు తగ్గుతుంది.
* కొత్త తేనె శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. పాత తేనె తీసుకుంటే మలబద్ధకం ఉండదు. తేనె ఎంత పాతబడితే అంత మంచిది.
* ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అరచెంచా తేనె వేడినీళ్లలో వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజూ మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి.
* అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే… అరకప్పు వేడి నీటిలో రెండు చెంచాల తేనె, వేయించిన వాము చెంచా వేసి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
* గోరువెచ్చటి నీళ్లలో అరచెంచా తేనె వేసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతుంది.
* కాఫీ, టీలకు బదులుగా తాగే గ్రీన్‌టీలో కొద్దిగా తేనె వేసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
* కొలెస్ట్రాల్‌ సమస్యలు ఉన్నవాళ్లు తేనెను గోరువెచ్చటి నీళ్లతో కలిపి రోజుకోసారి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉంటుంది.
* తేనె చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.
* అల్లం ముక్కలను తేనెలో నానబెట్టి తీసుకుంటే పైత్యం, అజీర్తి, కడుపులో తిప్పడం, నోటి దర్వాసన, పుల్లటి తేన్పులు తగ్గుతాయి. ఇది బాలింతలకూ మంచిది.!
***పిల్లలు పుష్టిగా పెరగాలంటే…
* పిల్లలు పుష్టిగా పెరగాలంటే పండ్ల రసాల్లో పంచదార బదులుగా తేనెను కలపాలి. మామిడిపండ్ల రసం, అరటిపండ్ల గుజ్జులో తేనెను కలిపి ఇస్తే కంటి చూపు మెరుగవుతుంది.
****హాయి నిద్రకు…
* పాలల్లో పంచదారకు బదులుగా తేనె వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. రాత్రి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
* బరువు పెంచే పదార్థాలతో కలిపి వాడితే బరువు పెరుగుతారు. తగ్గించే పదార్థాలతో కలిపి వాడితే తగ్గుతారు.
*****జాగ్రత్తలు…
* తేనెను నేరుగా వేడిచేయకూడదు. తేనె గట్టిపడితే వేడినీళ్లలో పెట్టాలి.
* ఎండలో తిరిగి వచ్చిన వెంటనే, ఎక్కువగా వ్యాయామం చేసిన తర్వాత తేనె తీసుకోకూడదు. బాగా సన్నగా ఉన్నవాళ్లు తేనెను నేరుగా వాడకూడదు.
* తేనె నల్లగా మారినా, పుల్లగా ఉన్నా, గట్టిగా తయారైనా ఉపయోగించకూడదు.