NRI-NRT

డెలావేర్‌లో అగ్నిప్రమాదం. బాధితుల్లో తెలుగు కుటుంబాలు.

Barrett Run Apartments Newark Delaware Fire Accident-Telugu People In Distress

అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం నెవార్క్‌లో సోమవారం నాడు స్థానిక బారెట్ రన్ అపార్ట్‌మెంట్ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సముదాయంలో భారతీయులు, తెలుగువారు కూడా నివసిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల్లో ఎంత మంది తెలుగువారు ఉన్నారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వేసవి కాలం సంభవించిన ఈ అగ్నిప్రమాదం వలన భారీ కీలలు ఎగిసిపడుతున్నాయి. చెక్కతో నిర్మించిన భవనాలు బూడిద కాకుండా అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.