NRI-NRT

విజయవాడ అలంకార్ వద్ద తానా అన్నదానం

TANA Feeding COVID19 Affected Poor And Labour In Vijayawada

బెజవాడకు చెందిన కోవిడ్-19 బాధితులకు తానా పలువిధాలుగా సహకారం అందజేస్తోంది. ఈ క్రమంలో తానా సహాయ కోశాధికారి కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటరు, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల వద్ద ఉన్న వలస కూలీలు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1000మందికి వారంరోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెంకట్ పేర్కొన్నారు.