Devotional

నెలరోజుల్లో మూడు గ్రహణాలు

Three eclipses in one month in june 2020

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది.

మరోవైపు.. రాబోయే 30 రోజుల్లో అంటే ఒక నెలలో 3 గ్రహణాలు సంభ‌వించ‌నున్నాయి.

గ్రహణం అనేది ఒక సాధార‌ణ ఖగోళ సంబంధిత‌ ఘటన అయినప్పటికీ, హిందూ ధర్మంలో దీనికి చాలా ప్రాముఖ్య‌త ఉంది.

ఈ సంవత్సరం అంటే 2020లో మొత్తం ఆరు గ్రహణాలు సంభ‌విస్తున్నాయి. జూన్, జూలై మధ్య కాలంలో మూడు గ్రహణాలు ఏర్ప‌డ‌నున్నాయి.

కాగా.. జనవరి 10, 2020న మొదటి చంద్ర గ్రహణం ఏర్ప‌డింది. రాబోయే జూన్ 5న రెండవ చంద్ర గ్రహణం సంభ‌వించ‌నుంది.

ఇది భారతదేశంతో సహా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలో క‌నిపించ‌నుంది. దీని తరువాత జూన్ 21న మరో చంద్ర గ్రహణం ఏర్ప‌డ‌నుంది.

ఇది ఈ సంవత్సరంలో మూడవ చంద్ర గ్రహణం అవుతుంది. ఈ గ్రహణం భారతదేశంతో సహా ఆసియాలో పూర్తిగా కనిపించే అవకాశం ఉంది.

అనంత‌రం జూలై 5న మ‌రో చంద్రగ్రహణం ఏర్ప‌డ‌నుంది. ఇది భారతదేశంలో కనిపించదు.