Health

సడలింపుతో జాగ్రత్త

You must be careful during this lockdown flexibility

లక్ష కేసులు దాటాక ఇచ్చేదాన్ని “సడలింపు” అనరు……. “చేతులెత్తేయడం” అంటారు. కావున మనమందరం జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రకృతి కోపాన్ని తుఫాన్‌, సునామీ. భూకంపాలు రూపంలో బాధపడడం చూశాం. కరోనాతో” అర్థమయింది ఏమిటంటే ప్రపంచాన్ని* ఊడ్చేయగల శక్తి ప్రకృతికే ఉందని మనం చూస్తున్నాం. కరోనా సమయంలో మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి… లేకపోతే కరోనా సుందరి మీ ఒళ్ళోవచ్చి వాలుతుంది…

ఇప్పటి నుండి ప్రభుత్వం వేరు.. ప్రజలు వేరు..

ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని చూస్తుంది.. ప్రజలేమో ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరి జాగ్రత్తలో వారుండాలి.

ఇంకో పది రోజుల తర్వాత హాస్పిటల్ లో కూర్చునేందుకు కూడా జాగా వుండకపోవొచ్చు… చాలా అప్రమత్తంగా ఉండాలి.. మందైనా, విందైనా, చిందయినా ఇవ్వాళ కాకుంటే రేపైనా దొరుకుతాయి..

ఉన్నది ఒకటే జిందగీ..! పోయిందంటే చచ్చినా మళ్ళీ రాదు .

కష్టం వస్తే నీ భూజాన్ని నీవే తట్టుకో… ఎందుకంటే ఈ సమాజం లో నెట్టేవాళ్ళే కాని భుజం తట్టే వాళ్ళు ఉండరు… అయిపోయిన గొడవలన్నీ మర్చిపోయిన సంగతుల్ని తవ్వుకో కూడదు… అందువల్ల ఏమి పొందలేము సరికదా లేని విచారాన్ని మరింత నెత్తిమీద వేసుకున్నట్టే .

మంచి చేయడానికి ఆరాటపడాలి అంతేగానీ మంచి అని అనిపించుకోవడానికి ఆరాట పడ కూడదు….

దాదాపుగా లాక్ డౌన్ ఎత్తివేసినట్లుగానే భావించాలి. ఫంక్షన్ హాళ్లు, మీటింగులు, దేవాలయాలు లాంటివి తప్ప మిగతా అన్ని అందుబాటులో ఉంటాయి…
కాబట్టి కరోనాతో సహజీవనం చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు వరకు మన పరిస్థితి ఒక ఎత్తు. ఇక రేపటి నుండి మరో ఎత్తు.
బస్సులో వెళ్లినా,
ఆటోలో వెళ్లినా,
షాప్ కు వెళ్లినా,
ఆఫీస్ కు వెళ్లినా
ఎవరి ఇంటికి వెళ్ళాలి అన్నా,
బంధు, మిత్రులు కానీ
మన ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరితో అప్రమత్తంగా ఉండాలి… అనుక్షణం జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాము కాబట్టి అంత టెన్షన్ లేదు. ఇక ఇప్పుడు మొదలు కాబోతుంది అసలు కథ, ఇక మన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ రీత్యా, పర్సనల్ పనుల కోసం ఎక్కడికి వెళ్లినా *COVID 19 జాగ్రత్తలు అన్ని తీసుకొని మనల్ని మనం కాపాడుకుంటూ… మన వాళ్ళను కాపాడుకుందాం..!!!