Business

₹1859కోట్ల నష్టం

DLF Losses 1858 Crores

స్థిరాస్తి దిగ్గజ సంస్థ డీఎల్‌ఎఫ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,857.76 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ప్రధానంగా తక్కువ పన్ను రేటు వద్ద స్వీకరించిన ఆస్తుల విషయంలో పన్ను తేడాల వల్ల నష్టం వాటిల్లిందని కంపెనీ తెలిపింది. 2018-19 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.436.56 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,660.95 కోట్ల నుంచి రూ.1,873.80 కోట్లకు తగ్గింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.583.19 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,319.22 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.9,029.41 కోట్ల నుంచి రూ.6,884.14 కోట్లకు పరిమితమైంది. ‘ఒకసారి అసాధారణ కేటాయింపులు రూ.272 కోట్లు, ఒన్‌-టైమ్‌ డీటీఏ రివర్సల్‌ రూ.1,916 కోట్ల వల్ల నష్టం పెరిగింద’ని డీఎల్‌ఎఫ్‌ శాశ్వత డైరెక్టర్‌ అశోక్‌ త్యాగి తెలిపారు. కొవిడ్‌-19 మహమ్మారి పరిశ్రమ వారీగా స్వల్పకాలిక గిరాకీని పరిమితం చేసిందని కంపెనీ పేర్కొంది. దీర్ఘకాలానికి పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉందని, అయితే మాకున్న ఆరోగ్యకరమైన ఆస్తి-అప్పుల పట్టీ, బలమైన బ్రాండ్‌ ఇమేజ్‌, రాజీ లేని నాణ్యత వల్ల దీర్ఘకాలానికి సానుకూల దృక్పథంతో ఉన్నామని డీఎల్‌ఎఫ్‌ వెల్లడించింది.