NRI-NRT

చికాగోలో చైనా వ్యతిరేక సెగలు

చికాగోలో చైనా వ్యతిరేక సెగలు

గల్వాన్‌ లోయలోని భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి హింసాత్మక ఘటనలకు పాల్పడిన చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని చికాగోలో ఉన్న చైనా రాయబార కార్యాలయం ఎదుట పలువురు భారతీయ అమెరికన్లు డ్రాగన్‌ దేశానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘‘ భారత భూభాగంలోని లద్దాఖ్, లేహ్‌ ప్రాంతాల్లో చైనా చొరబాటుకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నాం. ఆ దేశం చర్యలపట్ల భారతీయ అమెరికన్లు మౌనంగా ఉండరని ఈ సందర్భంగా చైనాకు స్పష్టం చేయదల్చుకున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా ఉంది’’ అని చికాగోకు చెందిన భారతీయ అమెరికన్ డాక్టర్‌ భరత్ బరాయ్‌ తెలిపారు.