DailyDose

మరో ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్-TNI బులెటిన్

మరో ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్-TNI బులెటిన్

* విజయనగరం జిల్లా పార్వతీపురంలో కరోనా కలకలం. భయం ఆందోళనల చెందుతున్న ప్రజలు.అధికార యంత్రాంగం. పార్వతీపురం లో రోజురోజుకి కరోనా సంఖ్య పెరుగుతున్నాయి . పార్వతిపురం పట్టణం మరియు డివిజన్ పరిధి లో ఉన్నమండలతో పలు గ్రామాలలో కరోనా కలకలం మొదలైంది

* కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే శాసనసభ సమావేశాలకు హాజరై వచ్చినప్పటినుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు… పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్ లో 11,489 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. 605 new cases in last 24 hrs in AP

* దిల్లీలో కొవిడ్-19 వ్యాప్తిని విశ్లేషించి.. వైరస్​ను ఎదుర్కొనేందుకు వీలుగా విస్తృత వ్యూహాన్ని రూపొందించడానికి ఉద్దేశించిన సెరోలాజికల్ సర్వేను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

* ప్రయివేట్‌లో కరోనా చికిత్సకు కళ్లు చెదిరే బిల్లు.. వైరల్ చేస్తున్న జగన్ ఫ్యాన్స్. ప్రయివేట్ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్మెంట్ చేయించుకునే వారికి బిల్లులు పేలిపోతున్నాయి. ఐదు రోజుల చికిత్సకే రూ.3.40 లక్షల బిల్లు చేతిలో పెట్టడం వైరల్‌గా మారింది.

* కరోనా మహమ్మారి వ్యాపార రంగాన్ని కుదేలు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో దుకాణాలు తెరవాలంటేనే వ్యాపారులు భయపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాప్తికి తాము కారణం కారాదనే భావనతో ఈనెల 26 నుంచి జులై 5 వరకు సికింద్రాబాద్‌లోని వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా బంద్‌ చేయనున్నట్లు సికింద్రాబాద్‌ చేనేత, సిల్కు, వస్త్ర దుకాణదారుల సంఘ అధ్యక్షుడు టి.అశోక్‌కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌లోని జనరల్‌బజారులోని బంగారు, వెండి, వజ్రాభరణాల దుకాణదారులూ అదే బాటలో ఉన్నారు. సూర్యా టవర్స్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల్లోని దుకాణాలను కూడా బంద్‌ చేస్తున్నారు.

* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాలు

దేశవ్యాప్తంగా 4,90,401 కేసులు,15,301 మంది మృతి

దేశ వ్యాప్తంగా 1,89,463 యాక్టీవ్ కేసులు, 2,85,637 మంది డిశ్చార్జ్

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 17,296 కేసులు,407 మంది మృతి

దేశంలో 58 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

మహారాష్ట్రలో అత్యధికంగా 1,47,741 కేసులు,6931 మంది మృతి

ఢిల్లీలో 73,780 కేసులు,2429 మంది మృతి

తమిళనాడులో 70,977 కేసులు,911 మంది మృతి

గుజరాత్ లో 29,520 కేసులు,1753 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో 20,193 కేసులు,611 మంది మృతి

రాజస్థాన్ లో 16,296 కేసులు,379 మంది మృతి

పశ్చిమ బెంగాల్ లో 15,648 కేసులు,606 మంది మృతి

మధ్యప్రదేశ్ లో 12,596 కేసులు,542 మంది మృతి

హర్యానాలో 12,463 కేసులు,198 మంది మృతి

తెలంగాణలో 11,364 కేసులు,230 మంది మృతి

ఏపీలో 10,884 కేసులు,136 మంది మృతి

కర్ణాటకలో 10,560 కేసులు,170 మంది మృతి

* టివి సీరియల్ ఇండస్ట్రీలో రోజుకు రోజు పెరుగుతున్న కరోనా కేసులుతాజాగా సీరియల్ హీరో హరి కృష్ణ కి కరోనా పాజిటివ్గృహ లక్ష్మీ సీరియల్ లో హీరో గా చేస్తున్న హరికృష్ణగృహ లక్ష్మీ సీరియల్ కి ఈటీవీ ప్రభాకర్ దర్శక నిర్మాతనేడు జరగాల్సిన గృహలక్ష్మీ షూటింగ్ రద్దుమొన్న కరోనా వచ్చిన నటుడు ప్రభాకర్ తో కలిసి తిరిగినందున అనుమానంతో టెస్ట్ చేయించుకున్న హరికృష్ణప్రభాకర్ తో కాంటాక్ట్ అయినా 33 మంది టెస్టులు రాకుండానే…మళ్ళీ మొదలైన షూటింగ్ లుఆందోళనలో టివి కార్మికులు.