NRI-NRT

కర్నూలు NRI ఫౌండేషన్ ఏర్పాటు

Kurnool NRI Foundation Starts Opening Begins

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్నూలు జిల్లా ఎన్నారైలను సమన్వయపరచడానికి కర్నూలు NRI ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో స్థిరపడిన కర్నూలు జిల్లా ప్రవాసాంధ్రుడు, తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. దీనిని లాభాపేక్ష లేని సంస్థగా రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిబిరాలు, నిర్వహిస్తామని, కళాకారులు, మేధావులు, క్రీడాకారులకు ప్రోత్సాహక ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ఓర్వకల్ మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘంకు చెందిన బాల భారతి పాఠశాల ద్వారా ప్రతి సంవత్సరం వందమంది అనాధ విద్యార్థులకి విద్యాదానం చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు kurnoolnrifoundation@gmail.com సంప్రదించాల్సిందిగా కోరారు. తానా ఫౌండేషన్‍ సహకారంతో కర్నూలు జిల్లాలో ఈ సంస్థ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కరోనా సేవా కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య పనివారు, పేదలు, రోజుకూలీ తదితరౌలకు 30వేలకు పైగా భోజనాన్ని అందించడమే గాక నిత్యావసర సరుకులు, కరోనా నిరోధక సామాగ్రిని కూడా అందజేసినట్లు రవి తెలిపారు.