Politics

ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటుకు కమిటీ నియామకం

ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటుకు కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. 4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

#################

క్యాబినెట్ నిర్ణయాలు… ??

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో 3, 7 సెక్షన్ లను సవరణ చేస్తూ కేబినేట్ లో నిర్ణయం

పగటిపూట 9గంటల విద్యుత్ రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కేబినేట్ లో చర్చ

ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కరువు నివారణ అభివృద్ది ప్రాజెక్ట్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయడంపై కేబినేట్ లో చర్చ

గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిధులు పరిహారం కేటాయింపు పై కేబినేట్ లో చర్చ

మరో రెండు వేల కోట్ల రూపాయల లోను తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీతో ఏపిఐఐసికి అనుమతి

ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే అంశంపై కేబినేట్ లో చర్చ.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కివ్స్ డిపార్ట్ మెంట్ లో ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ కేబినేట్ లో ఆమోదం.

420 టీచర్ పోస్టులను, 178 నాన్ టీచింగ్ పోస్ట్ లను శ్రీకాకుళం, ఒంగోలులో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ క్నోలెడ్జి అండ్ టెక్నాలజీ లో పోస్టులు క్రియేట్ చేస్తూ కేబినేట్ అమోదం తెలిపే అవకాశం.

31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించేందుకు కేబినేట్ లో నిర్ణయం.

సిఐడి విభాగంలో 9జూనియర్ స్టెనోలను, 10 జూనియర్ అసిస్టెంట్లను, 10 టైపిస్ట్ ల పోస్టింగ్ లను ఏర్పాటు చేస్తూ కేబినేట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ ఆర్డినెన్స్ 2020 జారీకి కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం.

డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీలో 17పోస్టులకు అనుమతిస్తూ కేబినేట్ లో అమోదం.

ఐదు కోట్లతో కర్నూలు జిల్లాలో గొర్రెల పెంపక శిక్షణాకేంద్రం ఏర్పాటు చేసేందుకు కేబినేట్ లో చర్చ.

తొమ్మిదిన్నర కోట్లతో కర్నూలు జిల్లాలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు కేబినేట్ లో అమోదం.

ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు హోం సైన్స్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్ల ఏర్పాటుకు కేబినేట్ లో అమోదం.