NRI-NRT

30వేల మందిపై మోడెర్నా వ్యాక్సిన ప్రయోగం

30వేల మందిపై మోడెర్నా వ్యాక్సిన ప్రయోగం

కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను నేడు 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం భారీ ఎత్తున నిర్వహించే పరీక్షలతో వ్యాక్సిన్‌ అసలు సామర్థ్యం బయటపడే అవకాశముందంటున్నారు నిపుణులు.