DailyDose

అమెరికా వార్తకు లాభాల్లో మార్కెట్లు-వాణిజ్యం

అమెరికా వార్తకు లాభాల్లో మార్కెట్లు-వాణిజ్యం

* అమెరికా ఎఫెక్ట్.. దూసుకుపోయిన మార్కెట్లు.యూఎస్ మరో స్టిమ్యులస్ ప్యాకేజీ ప్రకటించనుందని వార్తలుబలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్558 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఆటో, ఐటీ, ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాల్లో పయనించాయి. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించబోతోందనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 558 పాయింట్లు లాభపడి 38,493కి పెరిగింది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగబాకి 11,301కి చేరుకుంది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:అల్ట్రాటెక్ సిమెంట్ (7.15%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (4.79%), టీసీఎస్ (4.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.58%), టెక్ మహీంద్రా (3.73%). టాప్ లూజర్స్:ఐసీఐసీఐ బ్యాంక్ (-1.81%), నెస్లే ఇండియా (-1.29%), ఏసియన్ పెయింట్స్ (-1.21%), ఓఎన్జీసీ (-0.74%), ఐటీసీ లిమిటెడ్ (-0.38%).

* జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వేగన్‌ 2016లో డీజిల్‌ గేట్‌ కుంభకోణం బయటకు వచ్చినప్పటి నుంచి సుమారు 9.5 బిలియన్‌ డాలర్లను డ్రైవర్లకు పరిహారంగా చెల్లించిందని యుఎస్‌ ఫెడరల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

* కరోనా వైరస్‌ విలయం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే 16 మిలియన్ల మందికి పైగా సోకిన ఈ వైరస్‌ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు సైతం వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితుల్లో ప్రముఖ దిగ్గజ సెర్చింజన్‌ గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన ఈ టెక్‌ దిగ్గజం.. తాజాగా ఆ గడువును వచ్చే ఏడాది జూన్‌ వరకు పొడిగించింది.

* కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రముఖ వాహనం ‘పేజరో ఎస్‌యూవీ’ కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ మధ్యశ్రేణి స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం తయారీని 2021 నుంచి నిలిపివేయనున్నట్టు జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీదారు మిత్సుబిషి మోటార్స్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. వరుసగా రెండవ సంవత్సరం కూడా భారీ నష్టాలు చవిచూడాల్సి రావటంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. స్పోర్ట్స్‌ కార్ల విభాగంలో పేజరో అంతర్జాతీయంగా పేరు గడించింది. అత్యంత కఠినమైనదిగా భావించే డాకర్‌ ర్యాలీలో కార్ల విభాగంలో 2001 నుంచి 2005 వరకూ ఈ వాహనం వరుస విజయాలను సాధించింది. గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఈ ఘనతను ఇప్పటికీ ఎవరూ కనీసం సమం చేయలేకపోవటం గమనార్హం.

* ఆహార సరఫరా దిగ్గజం స్విగ్గీలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే మేనెలలో 1,100 మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ ఇప్పుడు మరో 350 మంది ఉద్యోగాల నుంచి తీసివేయాలని నిర్ణయించింది. కొవిడ్‌ ప్రభావం నుంచి స్విగ్గీ కేవలం 50శాతం మాత్రమే కోలుకొంది. ప్రస్తుతం జరుగుతున్న తీసివేతలు రీస్ట్రక్చరింగ్‌లో తుదివిడతగా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

* ఇటీవల ఓ ద్విచక్ర వాహన చోదకుడు ప్రమాదం నుంచి బయటపడిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో అదుపు తప్పిన ఓ జేసీబీ ఎక్సవేటర్‌ రోడ్డుపక్కనే ఆగిన ఓ ద్విచక్రవాహన చోదకుడిపైకి వెళుతుంది. అదే సమయంలో మహీంద్రా బొలేరో వాహనం వచ్చి జేసీబీని ఢీకొనడంతో అది పక్కకు వెళ్లిపోతుంది. ఆ ద్విచక్ర వాహన చోదకుడు స్వల్పగాయాతో బయటపడతాడు. అలోక్‌శ్రీవాస్తవ అనే వ్యక్తి ట్వీట్‌ చేసిన వీడియోపై మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో స్పందించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 228 పాయింట్ల లాభంతో 38,192 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 11,205 వద్ద కొనసాగుతున్నాయి. టెక్‌ మహీంద్రా, ఓమక్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, రెప్కో హోం ఫైనాన్స్‌ షేర్ల విలువ పెరగ్గా, మహా సియామ్‌లెస్‌, వా టెక్‌ వెబాగ్‌, హత్‌వే కేబుల్‌, యస్‌బ్యాంక్‌, డిష్‌టీవీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన రంగాలకు చెందిన అన్ని సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి.