Editorials

తనకు తానే గాయం చేసుకుని బిడ్డల ఆకలి తీర్చే పెలికాన్

తనకు తానే గాయం చేసుకుని బిడ్డల ఆకలి తీర్చే పెలికాన్

తన ముక్కుతో గుండెలను పొడుచుకుని గాయంచేసుకుని తన రక్తంతో పిల్లల ఆకలి తీరుస్తుంది. ఒక పక్షి త్యాగానికి గుర్తుగా ఉంది దాని పేరేంటో తెలుసా పెలికాన్ (Pelicon). సాధారణంగా పక్షులకు చిన్న ముక్కులు ఉండటాన్ని, కొంగలాంటి వాటికి ముక్కులు కాస్త పొడవుగా ఉండటాన్ని తెలుసు. కాని ఈ పక్షికి మాత్రం ముక్కు చాలా పొడవుగా ఉంటుందటా! అది ఏ పక్షో తెలుసా మీకు? ఆస్ట్రేలియన్ పెలికాన్ అనే పక్షి. దీనికి ముక్కు అత్యంత పొడవైనదని భావిస్తున్నారు. ఈ పక్షి ముక్కు పొడవు దాదాపు 47 సెంటీ మీటర్లు ఉంటుంది. ఎప్పడైనా కరువుకాలం వచ్చినప్పుడు ఆహారం లేక దాని పిల్లలకు చనిపోయే స్థితి ఎదురైనపుడు అది ఏంచేస్తుందో తెలుసా….? తన ముక్కుతో గుండెలను పొడుచుకుని గాయంచేసుకుని తన రక్తంతో పిల్లల ఆకలి తీరుస్తుంది. తన చివరి రక్తపు బొట్టును ఆహారంగా అందించి ఆఖరికి పిల్లలను బ్రతికించాలనే ఆలోచనలోనే తన ప్రాణాలను వదిలేస్తుంది పెలికాన్. అందుకనే డా౹౹విలియం కేరి గారు కలకత్తాలో ఉన్న సిరంపూర్ యూనివర్సిటీకి లోగో గా ఈ పక్షి బొమ్మనే త్యాగానికి గుర్తుగా ఎంచుకున్నారు. ప్రేమ స్వచ్చమైనది అది కేవలం త్యాగాన్ని మాత్రమే కనబరుస్తుంది మరణాన్నైనా ఆనందంగానే భరిస్తుంది.