NRI-NRT

ఫిలడెల్ఫియాను ముంచెత్తిన వరదలు

ఫిలడెల్ఫియాను ముంచెత్తిన వరదలు

ఫిలడెల్ఫియా పరిసర ప్రాంతాల్లో ఇసయెస్ తుఫాను వరద బీభత్సం సృష్టించింది. డార్బీ క్రీక్ పొంగిపొర్లడంతో ఈస్ట్‌విక్ ప్రాంతం జలమయం అయింది. తానా కార్యదర్శి పొట్లూరి రవి నివసిస్తున్న ప్రాంతం కూడా జలమయం అయింది. గడిచిన 18గంటలుగా తమకు విద్యుత్ సరఫరా లేదని, ప్రస్తుతానికి తమ ప్రాంతంలోని తెలుగువారు క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.