ScienceAndTech

టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం

టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం

కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనాపై ప్రపంచ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికాను ఆర్ధికంగా దెబ్బకొట్టాలని చైనా చూస్తోందని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, టిక్ టాక్, వీ చాట్ వంటి మాధ్యమాల ద్వారా అమెరికన్ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వాటిపై నిషేధం విధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. 45 రోజుల్లోగా ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.

కరోనా మహమ్మారికి చైనా అడ్డుకట్ట వేయకపోవడం, ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనా కారణం కావడంతో అమెరికాతో అనేక దేశాలు చైనాను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ సైతం చైనాపై ఉక్కుపాదం మోపింది. ఆ దేశానికీ చెందిన 2500 యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టు ప్రకటించింది. త్రైమాసిక బులెటిన్ ను గూగుల్ ఈ విషయాన్ని పేర్కొన్నది. స్పామ్, వివాదాస్పద కంటెంట్ ను ఆయా ఛానల్స్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాయని తెలిపింది. దీంతో ఆయా ఛానల్స్ ను తొలగించినట్టు గూగుల్ పేర్కొన్నది.