DailyDose

ఏపీలో నేడు 7వేలకు పైగా కరోనా కేసులు-TNI బులెటిన్

ఏపీలో నేడు 7వేలకు పైగా కరోనా కేసులు-TNI బులెటిన్

* 7665 news cases today in Ap

* తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులుతెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సోమవారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కు చేరుకుంది.కరోనా నుంచి కొత్తగా 1,587 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 57,586గా ఉంది.కరోనాతో మరో 10 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 637కు పెరిగింది.ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.జీహెచ్‌ఎంసీ పరిధిలో 389 కరోనా కేసులు నమోదయ్యాయి.కాగా ఆదివారం 11,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,840 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉంది. కాగా జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.78శాతం ఉంది.

* స్వర్ణ ప్యాలెస్‌ ఘటనపై ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూడు ప్రత్యేక బృందాలు రమేశ్‌ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు లభించినట్లు వెల్లడించారు. రమేశ్‌ ఆస్పత్రి నిబంధనలకి విరుద్ధంగా ఎక్కువ మంది పేషెంట్లను చేర్చుకొని వారి నుంచి రూ. లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. రమేశ్‌ ఆస్పత్రికి చెందిన మూడు బ్రాంచ్‌ ఆస్పత్రుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయని ఏసీపీ చెప్పారు.కరోనా నేపథ్యంలో రమేశ్‌ ఆస్పత్రి.. హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తోంది. ఈ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ చికిత్స పొందుతున్న పది మంది మృత్యువాత పడగా.. పలువురికి గాయాలయ్యాయి

* ఈరోజు తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం నలభై మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు వీరిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ సోకినట్లు సమాచారం ముష్టికుంట్ల కు చెందిన ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కు రాజు పేటకు చెందిన ఇరువురికి కుంద మిల్లు సమీపంలో ఉన్న ఒకరికి కనకదుర్గ గుడి పక్క బజారులో ఉన్న ఇరువురికి కరోనా పాజిటివ్ సోకినట్లు సమాచారం ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది