WorldWonders

సెల్‌ఫోన్‌లో అరకిలో బంగారం

సెల్‌ఫోన్‌లో అరకిలో బంగారం

కస్టమ్స్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా…విచ్చలవిడిగా బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. స్మగ్లర్లు కొత్త, కొత్త దారుల్లో దొంగ బంగారాన్ని దేశానికి తరలిస్తూ… అధికారులకు పట్టుబతున్నారు. ఇలాంటి ఘటనే ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ద్వారా బంగారాన్ని ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఫోన్ బ్యాటరీని తీసేసి… దాని స్థానంలో బంగారం బిస్కెట్ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా పని కానిచేద్దామనుకున్నాడు. కానీ విమానాశ్రయంలో అతడి వాలకం చూసి కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి అతడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి దాదాపు అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.