DailyDose

రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం ఇక బయట తిరగవచ్చు-నేరవార్తలు

రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం ఇక బయట తిరగవచ్చు-నేరవార్తలు

* బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌పై విషప్రయోగం జరిగిందని.. ఈ విషయం తెలియకుండా ఉండేందుకే శవపరీక్షను ఆలస్యంగా నిర్వహించారని ఆయన సామాజిక మాధ్యమాల్లో ఆరోపించారు.

* దళిత మహిళ రేప్ కేసులో 139 మందికి మరియు యాంకర్ ప్రదీప్ కి శిక్ష తప్పనిసరిగా పడాల్సిందే. అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకులు కొండ ప్రశాంత్. దళిత అమ్మాయి (మహిళా )రేప్ కేస్ విషయంలోఎంత పెద్ద తలకాయలు ఉన్న వారందరికీ తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే అని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకులు కొండ ప్రశాంత్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల కేంద్రం లో డిమాండ్ చేసారు.

* అక్రమంగా విశాఖపట్నం నుంచి ఖమ్మంకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* చీరాల మండలం తోటవారిపాలెంలో జరిగిన రిటైర్డ్ ఏఎస్సై నాగేశ్వరరావు హత్యకేసులో నిందితుడు రౌడీ షీటర్ దోనేపుాడి సురేంద్ర ను అరెస్ట్ చేసిన పోలీసులు.

* ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు పాల్పడేందుకు ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు.

* స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లో పనిచేయని సర్వర్..విజయవాడ ఒక్క గాంధీ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం లోనే పని చేయని సర్వర్..పడమట, గుణదల సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమస్యలు లేవు..గాంధీ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రమే సర్వర్ పని చేయడం లేదు..

* రమేశ్ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్ విషయంలో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం…తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.రమేష్ హాస్పిటల్ పై ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ పై స్టే విధించిన హైకోర్టస్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్ రమేష్ కుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణడాక్టర్ రమేష్ కుమార్ తో పాటు రమేష్ హాస్పిటల్ చైర్మన్ పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టువిచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు.ఏళ్ల తరబడి హోటల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.స్వర్ణ ప్యాలస్ హోటల్ లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులు అనుమతి ఇచ్చారని వాదించిన పిటీషనర్ తరపు న్యాయవాదిఅనుమతులు మంజూరు చేసిన అధికారులుకూడా ప్రమాదానికి బాధ్యులే కదా అన్న ధర్మాసనం.కేసు ఇంకా విచారణ దశలో నే ఉందన్న ప్రభుత్వ తరుపు న్యాయవాది.