Movies

తమిళంలో కూడా తానే మిత్రా

తమిళంలో కూడా తానే మిత్రా

ఓ భాషలో విజయవంతమైన చిత్రం మరో భాషలో రీమేక్ అయ్యేటప్పుడు మాతృకలో నటించిన హీరో హీరోయిన్లకు మళ్లీ అవకాశం రావడం అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన అవకాశం నివేదా థామ్సకు వచ్చిందని సమాచారం. తెలుగులో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఇందులో మిత్ర పాత్రలో నివేదా థామస్ నటించారు. ఇప్పుడీ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగులో నివేదా పోషించిన పాత్రకు తమిళంలోనూ ఆమెనే తీసుకున్నారట. తెలుగులో సినిమా విడుదలైనప్పుడు… మిత్ర పాత్రలో నివేదా థామస్ అద్భుతంగా నటించారని ప్రశంసలు వచ్చాయి. అందువల్లే, తమిళ రీమేక్లోనూ ఆమెను తీసుకున్నట్టున్నారు. ఇటీవల విడుదలైన ‘దర్బార్’లో రజనీకాంత్ కుమార్తెగా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ‘వి’ చేస్తున్నారు.