Politics

₹861.90 కోట్లతో టాటాలకు కాంట్రాక్టు

₹861.90 కోట్లతో టాటాలకు కాంట్రాక్టు

టాటాకు నూతన పార్లమెంటు భవన నిర్మాణ ప్రాజెక్టు

పార్లమెంటు నూతన భవన నిర్మాణ ప్రాజెక్టు టాటాకు దక్కింది.

ఈ ప్రాజెక్టు కోసం ఎల్​ అండ్​ టీ లిమెటెడ్​ రూ.865 కోట్లకు బిడ్ దాఖలు చేయగా.. టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ రూ.861.90 కోట్లకు బిడ్​ను కైవసం చేసుకుంది.

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పార్లమెంటు నూతన భవన నిర్మాణానికి మూడు కంపెనీలు ఆన్​లైన్ బిడ్ల ద్వారా ఎంపికయ్యాయి.

మొత్తం 7 కంపెనీలు ఆసక్తి చూపగా లార్సెన్ అండ్ టబ్రో, షాపుర్​జీ పల్లోంజి, టాటా సంస్థలు పోటీ పడ్డాయి.

2022 నాటికి..

పార్లమెంటు, రాష్ట్రపతి భవన్​, మంత్రులు, ఎంపీల నివాసాల కోసం సెంట్రల్​ విస్టా రీడెవలప్​మెంట్ ప్రాజెక్టు చేపట్టింది మోదీ ప్రభుత్వం.

దీనికింద దిల్లీలోని పార్లమెంటు హౌస్ స్టేట్​లోని 118 ప్లాట్ నంబర్​లో కొత్త భవనాన్ని నిర్మించనుంది.

ఈ భవనంలో గ్రౌండ్, బేస్​మెంట్​తో రెండు అంతస్తులు ఉంటాయి.

2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయానికి ఈ భవనం సిద్ధం చేయాలని కేంద్రం భావిస్తోంది.